పౌరసత్వ చట్ట సవరణలో ఈ వివక్ష ఎందుకు?
మత పీడన కారణంగా భారత్‌లోకి వలస వస్తున్న వారికి సులభంగా పౌరసత్వ కల్పనకోసం వలస చట్టంలో ప్రభుత్వం మార్పు తీసుకురావాలనుకోవడం ఎంతైనా ముదావహమే. కానీ ఈ చట్ట సవరణ నుంచి ముస్లింలను మినహాయించడం సరైనది కాదు. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వీటిలో దేని ప్రాతిపదికన అయినా సరే ఏ వ్యక్తిపట్లా ప్రభుత్వం వివక్షత ప్రదర్శించరాదన్నది రాజ్యాంగ సూత్రం.
దేశంలోకి వలస వచ్చిన వారిపై ఒక వార్తను నేను ఇటీవలే చదివాను. ఆ వార్తను చూశాక కేంద్రప్రభుత్వం తానేం చేస్తు న్నాననే విషయంలో సరైన అవగాహనతో ఉందా అని ఆశ్చ ర్యమేసింది. ది హిందూలో వచ్చిన ఆ వార్త ఒక అంశాన్ని తెలియచెప్పింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపీడన కారణంగా అక్కడినుంచి పారిపోయి వచ్చిన, సరైన ధ్రువపత్రాలు లేని వలస ప్రజలకు పౌరసత్వం మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వం 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించనుందనీ ఈ చర్య అస్సాంలోనూ, వాయవ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర పరిణామాలకు దారితీయనుందని ఆ వార్తా కథనం పేర్కొంది. కే వలం హిందువులే కాకుండా, బౌద్ధులు, క్రైస్తవులు, జోరాస్ట్రియన్లు, సిక్కులు, జైనులు కూడా వలస వచ్చిన వారిలో భాగమై ఉంటారని ఆ వార్త జోడించింది. పైన పేర్కొన్న సామాజిక బృందాలు భారత్‌కు చట్టబద్ధంగా వలస రావడాన్ని సులభతరం చేస్తూ ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టనుందని కూడా ఆ వార్త పేర్కొంది.
ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య సరైనదేనని నా అభిప్రాయం. మతం లేదా జాతి కారణంగా ఏ దేశంలో అయినా ప్రజలు పీడనకు గురవుతున్నట్లయితే, స్వీకరించి వారికి ఆశ్రయం ఇవ్వాల్సిన విధి ఇతర జాతీయ దేశాలపై ఉంది. అయితే ఆ జాబితాకేసి చూస్తే, నా సదభిప్రాయం మొత్తంగా ప్రశ్నార్థకం అవుతుంది. మరి ముస్లింల మాటే మిటి? ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సూత్రీకరణలో వీరిని పూర్తిగా వదిలేసినట్లుంది.
స్పష్టమైన కారణాలతోనే ఇలా జరిగి ఉండవచ్చు. భార తదేశ విభజన మత ప్రాతిపదికన జరిగింది, కొద్దిమేరకు ప్రజాస్వామిక పద్ధతిలో కూడా జరిగిందని చెప్పాలి. 1945- 46 ఎన్నికల్లో ముస్లిం లీగ్ భారీ మెజారిటీతో గెలిచిన కార ణంగా (తక్కువ సంఖ్యలో ప్రజలు ఓటు వేసినప్పటికీ ఇవి ప్రత్యేక నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికలు) దేశాన్ని అంతిమంగా విభజించాలనే డిమాండ్‌కు బలం చేకూరింది. ముస్లింలు విభజన కోరుకోవడం వల్ల దాన్ని సాధించు కోగలిగారు. వారు వెళ్లిన కొత్త దేశాల్లో ఎవరైనా విభజనను ఇష్టపడితే దానిపై ముస్లింలు అభ్యంతరాలు చెప్పకూడదు. ఈ సమస్యను భారతీయ జనతా పార్టీ అవగాహన చేసు కున్న తీరులో గానీ (గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచా రంలో ఇది సుస్పష్టమయింది), సవరించి కొత్తగా ప్రతిపాది స్తున్న చట్టంలో కాని ఉన్న తర్కం ఇదే. ఈ సెంటిమెంటులో నుంచే ముస్లింలను ప్రత్యేకించి ఆ జాబితాలోంచే మినహా యించడం జరిగింది. నేను ముందే చెప్పినట్లుగా ఇది అసా ధారణమైనది. పైగా ఒక పరిధిని దాటి దీనికి వ్యతిరేకంగా వాదించలేము కూడా.
భారత్‌లో అన్ని ప్రభుత్వాలూ అవిభాజ్య భారత దేశానికి సంబంధించిన ప్రాంతాల నుంచి వచ్చిన హిందు వులను, సిక్కు వలస ప్రజలను సానుభూతితో చూసేవి. అలాంటి వారికి బేషరతుగా పునరావాసం కల్పించడాన్ని మీడియా కూడా బలపర్చేది. నా సమస్య అల్లా ఏమిటంటే, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న చట్టంలోని మార్పుల గురించే. దేశంలోకి ప్రవేశించి, తమ పేర్లను స్వయంగా నమోదు చేసుకోవడంలో ఇక్కట్లు ఎదు ర్కొన్న ఇలాంటి వారిని అనుమతించడానికి పౌరసత్వ చట్టంలో, పాస్‌పోర్ట్ చట్టంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే భారత్లోఉన్న వారు సులువుగా పౌరులుగా మారడానికి ఈ మార్పులు కాస్త వెసులుబాటు కలిగిస్తాయి.
ఈ వ్యవహారం మొత్తంగా చూట్టానికి బాగానే ఉంది. అయితే ఒక ప్రత్యేక మతానికి చెందిన వారిని మినహా యించడానికి గానూ చట్టంలో ఒక పరిభాషను ప్రభుత్వం ఎలా ప్రవేశపెట్టబోతోంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15 ఇలా చెబు తున్నాయి. ‘చట్టం ముందు సమానత్వం: భారత భూభాగం లో చట్ట సమానత్వం లేదా చట్టపరంగా సమాన రక్షణను పొందడంలో ఏ వ్యక్తి హక్కునూ ప్రభుత్వం నిరాకరించకూ డదు. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ప్రాతి పదికన వివక్షతను నిషేధించడమైనది: మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వీటిలో దేని ప్రాతిపదికన అయినా సరే ఏ వ్యక్తిపట్లా ప్రభుత్వం వివక్షత ప్రదర్శిం చరాదు.’ ఇప్పుడు నా అవగాహన మరింత స్పష్టమైన రూపు దాల్చినట్లు తోస్తోంది. బంగ్లాదేశీ ముస్లింలను మినహా యించి, బంగ్లాదేశీ క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, యూదులు తదితరులు మత పీడనకు గురవుతున్నామన్న ప్రాతిపదికన వలస రావడానికి చట్టంలోని ఏ మార్పయినా ఎలా అనుమతించగలదు?
నా అభిప్రాయం ప్రకారం అలా జరగదు. అలాంటి చట్టాన్నే రూపొందించినట్లయితే, దానికి మత ప్రాతిపదికే ఉన్నట్లయితే దాన్ని సవాలు చేసి సులభంగా రద్దు చేయ వచ్చు. ఈ తరహా చట్టాలు ఇప్పటికే పౌరులుగా ఉన్నవారికే తప్ప ఇకపై పౌరులుగా కావాలనుకున్నవారికి వర్తించవు అని ఎవరైనా వాదించవచ్చు కానీ, దానికి సంబంధించిన విధివిధానాలు చాలా స్పష్టంగా ఉంటాయి. పైగా మిన హాయింపులతో చట్టాలను రూపొందించడం సాధ్యం కాదు కూడా.
ఈ సమస్యకు సంబంధించిన ఇతర అంశాలను కూడా నేను సూచిస్తాను: ముస్లిం దేశాలనుంచి పారిపోవాలని ముస్లింలు ఎందుకు భావిస్తున్నారు? ... సిరియా నుంచి ఇరాక్‌కు, ఇరాక్ నుంచి లిబియాకు ఇప్పటికే వేలాదిమంది ముస్లింలు వలసపోతూనే ఉన్నారు. మన విషయానికి వస్తే, ముస్లిం అనేది ఎవరో ఒకరి గుర్తింపులో భాగం కాదు. వారు షియాగా ఉన్నందుకు, అహ్మదీగా, మహిళగా, కాలమిస్టుగా, మతభ్రష్టుడుగా, హోమో సెక్సువల్‌గా, నాస్తికుడిగా ఉన్నందుకు, చివరికి దైవ దూషణకు పాల్పడినందుకు ఇలాంటి పలు కారణాల వల్ల కూడా ముస్లింలు లక్ష్యంగా మారవచ్చు. ఉదాహరణకు తాను చట్టపరంగా పీడనకు గురైనట్లు పాకిస్తానీ అహ్మదీ చెప్పినట్లయితే, ఆమెకు రక్షణ కల్పించేందుకు అర్హురాలు కాదని కొత్త చట్టం అనర్హురాలిని చేస్తుందా?
ఇండియా కూడా తనకు చెందిన కొందరు మైనారి టీలను పీడించిన చరిత్ర కలిగి ఉన్నదని ఆ దేశాల్లోని కొంత మంది వాదించవచ్చు. ఉదాహరణకు 1984లో ఢిల్లీలో సిక్కులు.. ఇంకా ఘటనల వారీగా మరెన్నింటినయినా చెప్పవచ్చు. కాన్ని దాన్ని మనం ప్రస్తుత వాదన నుంచి వదిలివేద్దాం.
వలస చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తున్న చర్య వల్ల తన పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదముందని విదేశాంగ శాఖ మన హోంశాఖను హెచ్చ రించిందని కూడా ది హిందూ వార్త పేర్కొంది. అందువల్లే ఈవిషయమై రాజకీయ నిర్ణయం తీసుకున్నారని అది తెలిపింది. మనం ఇంతవరకు ఇక్కడ చర్చించిన అంశాలను రాజ కీయ నిర్ణయం పరిగణనలోకి తీసుకుంటుందని నేను భావి స్తున్నాను. ప్రభుత్వ సద్భావనా ప్రయత్నాలు మన రాజ్యాం గంలోని ప్రాథమిక సూత్రాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అది నిజంగా దురదృష్టమే అవుతుంది.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com
- ఆకార్ పటేల్