breaking news
Amir Khan Muttaqi
-
‘తాలిబన్ నేతకు డిన్నర్ ఇస్తారా?: అవమానంతో తలదించుకున్నట్లుంది’
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ఏర్పాటైన సుమారు నాలుగేళ్ల తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ భారత్ పర్యటనపై ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్ విమర్శలు గుప్పించారు. ఒక తాలిబన్ నేతను భారత్‌కు ఆహ్వానించడమే కాదు.. డిన్నర్ కూడా ఇస్తారా? అవమానంతో తలదించుకున్నట్లైంది అంటూ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే మనం, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ నేతకు విందు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అన్ని ఉగ్రవాద సంస్థలపై పోరాటం చేసే మనం, ఇలా వారిని ఆహ్వానించి ప్రత్యేక విందులు ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు.I hang my head in shame when I see the kind of respect and reception has been given to the representative of the world’s worst terrorists group Taliban by those who beat the pulpit against all kind of terrorists . Shame on Deoband too for giving such a reverent welcome to their “…— Javed Akhtar (@Javedakhtarjadu) October 13, 2025 కాగా, ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా అమిర్ ఖాన్ ముత్తఖీ.. ఇటీవల ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ మేరకు భారత్ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ తాము అఫ్గాన్‌ను ముందుకు నడిపిస్తున్న తీరును వివరించారు. అదే సమయంలో తమ దేశంలో ఉగ్రజాడలు లేకుండా చేశామని కూడా చెప్పుకొచ్చారు. భారత్ గడ్డపై నుంచే పాక్ ఉగ్రవాదాన్ని వీడాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇలా ముత్తఖీ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్-అఫ్గాన్ల మధ్య పోరు రాజుకుంది. తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. ఇదీ చదవండి:అంతా మాలా ఉండండి.. ఉగ్రవాదాన్ని తరమండి: అఫ్గాన్ మంత్రి -
శాంతియుత పరిష్కారం కావాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సరిహద్దుల వెంట కొనసాగుతున్న ఉద్రిక్తత సమసిపోయేందుకు శాంతియుత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఫీ వ్యాఖ్యానించారు. పోరు సద్దుమణిగేందుకు శాంతియుత మార్గాలను అన్వేషిస్తామని, అది సాధ్యంకాకుంటే ఇతర ‘మార్గాలను’ వెతుకుతామని ఆయన అన్నారు. భారత పర్యటనలో ఉన్న ముత్తాఖీ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వంటి విదేశీ శక్తుల చొరబాట్లను అడ్డుకునేందుకు అఫ్గానిస్తాన్ ఐక్యంగా పోరాడుతుంది. అఫ్గాన్ సార్వభౌమత్వానికి భంగపరిచే ఎలాంటి చర్యలను మేం సహించబోం. చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యల పరిష్కారానికే మా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదనేదే మా విదేశాంగ విధానం. అది కుదరనప్పుడు మేం వేరే దారులను వెదికి అనుకున్నది సాధిస్తాం. అయినా మాకు పాక్ ప్రభుత్వం, ప్రజలతో ఎలాంటి విబేధాలు లేవు. అక్కడ తిష్టవేసిన కొన్ని శక్తులే(ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు) అసలు సమస్య. అఫ్గాన్‌లో అంతర్గతంగా విబేధాలు ఉండి ఉండొచ్చు. కానీ బయటిశక్తుల నుంచి పెను ప్రమాదం పొంచి ఉంటే తాలిబాన్ ప్రభుత్వ, పౌరులు, మతాధికారులు అంతా ఏకమై శత్రువును తుదముట్టిస్తారు ’’ అని ఆయన అన్నారు. -
మాకు ఇండియానే ఫస్ట్.. పాకిస్తాన్ కు షాకిచ్చిన తాలిబన్ మంత్రి
-
అఫ్గాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభం
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని భారత్ టెక్నికల్ మిషన్ ఇకనుంచి దౌత్య కార్యాల యంగా మారనుంది. అంతేకాదు, తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించనుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఈ విషయాలను ప్రకటించారు. భద్రతాపరమైన భారత ప్రభుత్వ ఆందోళనలపై సానుకూలంగా స్పందించిన తాలిబన్లను ఆయన అభినందించారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించి భారత్‌కు సంఘీభావం తెలపడం ముఖ్యమైన విషయ మన్నారు. ఆ దేశంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధ రించడంతోపాటు కొత్తగా ఆరింటిని ప్రారంభించనున్నామన్నారు. సుహృద్భావ సూచనగా 20 అంబులెన్సులను కానుకగా అందజేయనున్నట్లు చెప్పారు. ముందుగా ఐదు అంబులెన్సులను స్వయంగా మంత్రి ముత్తాఖీకి అందజేశానని జై శంకర్ తెలిపారు. భారత్‌లో ఆరు రోజుల పర్యటనకు వచ్చిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీతో మొదటిసారిగా జై శంకర్ శుక్రవారం భేటీ అయ్యారు. భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకునేందుకు ఎవరికీ అవకాశ మివ్వబోమని ముత్తాఖీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు దేశాలతోపాటు ఈ ప్రాంతమంతటికీ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సవాలుగా మారిందని అంగీకరించారు. ఈ ఉగ్ర గ్రూపుతో తాము సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. భారత కంపెనీలు తమ దేశంలో గనులు, ఖనిజాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనివల్ల రెండు దేశాల వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు. రెండు దేశాల మధ్య నేరుగా అదనంగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు. అనంతరం, ముత్తాఖీ మీడియాతో మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు దశల వారీగా చేపట్టే చర్యల్లో భాగంగా భారత్‌కు దౌత్యాధికారులను కూడా పంపిస్తామన్నారు. మహిళా జర్నలిస్టులకు అందని ఆహ్వానం అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోకి మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం పంపకపోవడం వివాదానికి దారి తీసింది. భారత్‌లో ఉన్నా తాలిబన్లు లింగ వివక్షను కొనసాగించడంపై నిరసన వ్యక్తమైంది. భారత ప్రజాస్వామిక విలువలకు ఇది అవమానకరమంటూ జర్నలిస్టులతో పాటు రాజకీయ నేతలు, నెటిజన్లు మండిపడ్డారు. సహనాన్ని పరీక్షించొద్దు: ముత్తాఖీ హెచ్చరికమీడియా సమావేశంలో ముత్తాఖీ పాకిస్తాన్ తీరుపై మండిపడ్డారు. కాబూల్‌లోని తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) స్థావరాలే లక్ష్యంగా పాక్ వైమానిక దాడులకు దిగడంపై ఆయన స్పందిస్తూ.. అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించే సాహసం చేయొద్దంటూ ఆ దేశానికి గట్టి వార్నింగిచ్చారు. ‘సరిహద్దులు దాటి మా భూభాగంలో దాడికి పాల్పడి పాకిస్తాన్ తప్పు చేసింది. 40 ఏళ్ల తర్వాత శాంతిని, పురోగతి దిశగా సాగుతున్నాం. ఈ సమయంలో అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించవద్దు’ అని ముత్తా్తఖీ అన్నారు. -
అంతా మాలా ఉండండి.. ఉగ్రవాదాన్ని తరమండి: అఫ్గాన్ మంత్రి
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి మవ్లావీ అమీర్ ఖాన్ ముత్తాకీ.. పాకిస్తాన్‌కు సందేశంతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ముత్తాకీ. తాము అధికారం చేపట్టిన తర్వాత అఫ్గాన్‌లో ఒక ఉగ్రవాది పురుగు కూడా చొరబడలేదన్నారు ముత్తాకీ. తమ దేశం తరహాలోనే ప్రతీ దేశం కూడా ఉగ్రవాదంపై పోరును సాగించాలనే సూచించారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు భారత్ గడ్డపై నుంచే వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా అఫ్గాన్‌లో ఉగ్రవాదం అనే ఛాయలే లేవని, అందుకు తాము అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. అంతకుముంద లష్కరే తోయిబా, జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థలు తమ గడ్డ నుంచి కార్యకలాపాలు సాగించినా తాము అధికారం చేపట్టిన తర్వాత ఆ పప్పులు ఉడకలేదన్నారు. ఏ దేశంలోనైనా శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు సూచించారు. ఇది పాకిస్తాన్ ఆచరిస్త వారికి మంచిదంటూ తన సందేశంలో పేర్కొన్నారు. తాలిబన్లు అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశం నుంచి ఒక దౌత్యవేత్త భారత్‌కు రావడం ఇదే తొలిసారి. నిన్న(అక్టోబర్9వ తేదీ) భారత్‌లో అడుగుపెట్టారు ముత్తాకీ. తన భారత పర్యటనలో జై శంకర్, అజిత్ ధోవల్‌తో సమావేశం కానున్నారు ముత్తాకీ. ఇది చదవండినోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ!


