18 నుంచి రాష్ట్రస్థాయి షూటింగ్
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ ఈ నెల 18 నుంచి 22 వరకు రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్ నిర్వహించనుంది. పురుషుల, మహిళల, సబ్ జూనియర్, సీనియర్, వెటరన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. 10 మీ. ఎయిర్ రైఫిల్, 10 మీ. ఎయిర్ పిస్టల్, 25 మీ. పిస్టల్ ఈవెంట్స్, 50 మీ. రైఫిల్, పిస్టల్ ఈవెంట్స్, షాట్‌గన్, స్కీట్, ట్రాప్, డబుల్ ట్రాప్ ఈవెంట్స్‌లో షూటర్లు పోటీ పడొచ్చు.
అక్టోబర్‌లో పశ్చిమ బెంగాల్లో జరిగే ప్రి నేషనల్ టోర్నీలో ఈ స్కోర్లను పరిగణిస్తామని ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్ సంఘీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 14లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం నిర్వాహక కార్యదర్శి అహ్మద్ షఫీ (9866072411), ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ (9391327999)లను సంప్రదించవచ్చు.