Amla juice
-
పరగడుపున ఉసిరి తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?
Health Tips: ►ఉసిరి పచ్చడి తీసుకోవడం, తేనెలో నానపెట్టిన ఉసిరిని నిత్యం పద్ధతి ప్రకారం సేవించడం ద్వారా దృష్టిలోపం తగ్గుతుంది. ఉసిరి పొడిని నిత్యం పరకడుపున తేనెతో కలిపి సేవించడం వల్ల వత్తిడి, అలసట తగ్గుతుంది. ►ఎండు ద్రాక్షలు లేదా కిస్మిస్లు వాడడం మంచిది. వీటికి చలువ చేసే గుణం వుంది. గ్లాసుడు నీళ్లలో ఎండు ద్రాక్షలు వేసి, నానపెట్టి, ఆ నీటిని తీసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది. ► గోధుమలు, బియ్యం, పెసలు, రాగులు, సోయాగింజ లు, జొన్నలు అరకిలో వంతున కలిపి, 50 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల జీలకర్ర జోడించి, దోరగా విడివిడిగా వేయించాలి. ఆపై మరపట్టించి రొట్టెలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండితో జావ కూడా చేసుకోవచ్చు. ► నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి, ఆ నీటిని సేవించడం వల్ల మంచి ఫలితం వుంటుంది. పుదీనా ఆకులు, ఉప్పు కలిపి నీటిలో మరిగించి, ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది. -
డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గ్రీన్ ఆమ్ల జ్యూస్.. బీపీ క్రమబద్ధం చేసే డ్రింక్!
గ్రీన్ ఆమ్ల... హనీ ఆమ్ల... ఆరోగ్యసిరినిచ్చే ఉసిరి తింటే వచ్చే ప్రయోజనాలెన్నో... ఆ అన్నింటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి వంటిల్లూ ఉసిరి సంపదలతో విలసిల్లాలి మరి! గ్రీన్ ఆమ్ల జ్యూస్ కావలసినవి : ►ఉసిరికాయలు– 3 లేదా నాలుగు (సైజ్‌ని బట్టి) ►అల్లం – అర అంగుళం ముక్క ►నీరు– 200 మిల్లీ లీటర్లు ►ఉప్పు– చిటికెడు ►నిమ్మరసం– టీ స్పూన్. తయారీ: ►అల్లం, ఉసిరికాయలను తురిమి నీటిలో కలపాలి. ►అందులో ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి రోజూ ఉదయం తాగాలి. ►ఫైబర్‌తో తాగడమే మంచిది. తురుము అడ్డు పడుతోందనిపిస్తే పది నిమిషాల తర్వాత వడపోసి తాగవచ్చు. ►ఈ జ్యూస్ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. పై పరిమాణం ఒకరికి సరిపోతుంది. గమనిక: బీపీ, డయాబెటిస్లను అదుపులో ఉంచుకోవడానికి ఆమ్ల జ్యూస్ తాగాలనుకునే వారికి సూచన. ఉసిరికాయల సీజన్ పోయిన తర్వాత మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే ఎడిబుల్ ఆమ్లాపౌడర్ వాడవచ్చు. ఒక ఉసిరి కాయకు ఒక టీ స్పూన్ పౌడర్ దాదాపుగా సమానం. హనీ ఆమ్ల డ్రింక్ కావలసినవి: ►ఉసిరికాయ – ఒకటి ►గోరువెచ్చటి నీరు– కప్పు ►పుదీన ఆకులు– నాలుగు ►తేనె – టీ స్పూన్ తయారీ: ►ఉసిరికాయ, పుదీన ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసి రసం తీసుకుని గోరువెచ్చటి నీరు, తేనె కలపాలి. ►ఈ జ్యూస్‌ని రోజూ ఉదయం తాగాలి. ►ఇది బీపీని క్రమబద్ధం చేస్తుంది. ట్రై చేయండి: Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ చదవండి: Diabetes: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో.. -
పతంజలికి మరో షాక్!
న్యూడిల్లీ: భారీ టార్గెట్‌తో ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి దూసుకొచ్చిన యోగా గురు రాందేవ్‌బాబా సంస్థ పతంజలికి మరో షాక్ తగిలింది. ప్రకృతి సిద్ధం, ఆయుర్వేదం అని చెప్పుకునే పతంజలి బ్రాండ్ నేమ్ మరోసారి చిక్కుల్లో పడింది. పతంజలి పాపులర్ బ్రాండ్ ఆమ్లా జ్యూస్‌పై కోలకతా ల్యాబ్ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో భారతదేశం డిఫెన్స్ రంగానికి చెందిన రిటైలింగ్ వేదికల్లో పతంజలి అమ్లా జ్యూస్ అమ్మకాలను నిలిపివేసింది. సీఎస్డీ క్యాంటీన్లలో ఈ జ్యూస్ విక్రయాలను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోల్‌కతా సెంట్రల్ ఫుడ్ ల్యాబ్ తాజా నివేదిక ఆధారంగా సీఎస్డీ ఈనిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల క్రితం నెస్లే మాగి నూడుల్స్ పై సంచలన ఆరోపణలు చేసిన ల్యాబ్ ఈ అభ్యంతరాలను వ్యక్తం చేయడం గమనార్హం. మ్యాగీ నూడల్స్‌లో ప్రమాదకర లెడ్ లెవల్స్ అధికంగా ఉన్నాయని ప్రకటించిన ల్యాబ్ తాజాగా పతంజలి ఆమ్లా జ్యూస్‌పై కొరడా ఝళిపించింది. దీంతో డిఫెన్స్‌కు చెందిన క్యాంటీన్ స్టోర్ట్స్ డిపార్ట్మెంట్( సీఎస్డీ) లలో అమ్మకాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఏప్రిల్ 3, 2017న రాసిన ఒక లేఖ రాసింది. అన్ని సీఎస్డీ డిపోలలోఉన్న పతంజలి ఆమ్లా జ్యూస్ కు సంబంధించిన స్టాక్ వివరాలను అందించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. వీటిని రిటన్ ఇచ్చేందుకు డెబిట్ నోట్ తయారు చేయాల్సిందిగా కోరారు. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి సీసీం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నాయని ఈ ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైందిన దీంతో మ్యాగీ నూడుల్స్ ను వెనక్కితీసుకున్న నెస్లే వేల కోట్ల రూపాయలను నష్టపోయింది. 1948లో ఈ సీఎస్డీ క్యాంటీన్ లు ప్రారంభించబడ్డాయి. మాజీ సైనికులు, వారికుటుంబాలతో సహా డిఫెన్స్‌రంగంలోని సుమారు 12 మిలియన్లమంది ఈ సీఎస్డీ సేవలను వినియోగించు కుంటుండగా, దాదాపు 5,300 రకాలు ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తారు. కాగా రూ.5వేల కోట్ల బిజినెస్ టర్నోవర్‌తో సాగుతున్న పతంజలి ఉత్పత్తులపై ఆరోపణలు ఇదేమొదటిసారి కాదు. ఇటీవల అనుమతి లేకుండానే పతంజలి న్యూడల్స్, పాస్తా విక్రయిస్తోందని ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆరోపించింది. అలాగే గతంలో వంటల నూనెల ప్రకటనలో వినియోగదారులను తప్పు దారి పట్టిస్తోందని మొట్టికాయలు వేసింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి విదితమే.