amrabad mandal
-
ఏడాది నుంచి లవ్: ప్రియురాలు దక్కడం లేదని..
సాక్షి, మహబూబ్‌నగర్ : ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని లింగమయ్యకాలనీకి చెందిన కాట్రాజు పవన్‌కుమార్ (23), ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు సోమవారం రాత్రి ఇంటి వద్ద పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఇది గమనించిన బంధువులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అదే అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, పవన్‌కుమార్ తల్లిదండ్రులు సుమారు 12ఏళ్ల క్రితమే మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడగా, ప్రస్తుతం సోదరి మాత్రమే ఉంది. ఈ విషయమై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహంతో రాస్తారోకో యువకుడి మృతికి ప్రేమించిన యువతి తల్లిదండ్రులే కారణమంటూ అంబేద్కర్కూడలిలో పవన్‌కుమార్ మృతదేహంతో బంధువులు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. బాధ్యులను శిక్షించి, బాధిత కుటుంబ సభ్యులకు తగు న్యాయం చేయాలన్నారు. సీఐ బీషన్న చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
పట్టించుకోని భార్య.. ఆ ‘నలుగురు’గా మారిన ముస్లిం యువత
అమ్రాబాద్ (అచ్చంపేట): ముస్లిం యువకులు మానవత్వంతో ముందుకు వచ్చి కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. అమ్రాబాద్ మండలం తిర్మలాపూర్ (బీకే)కు చెందిన ఎల్కచేను తిరుపతయ్య (50) కిడ్నీవ్యాధిగ్రస్తుడు. ఈ నెల 16వ తేదీన మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. పెళ్లి అయిన కొన్నేళ్లకు భార్య పిల్లలతో కలసి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరివాడైన తిరుపతయ్యకు ఇల్లు కూడా సరిగా లేదు. వారం కిందట స్థానిక వైద్యాధికారి వచ్చి రెండోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో జిల్లాకేంద్రంలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. శుక్రవారంరాత్రి అమ్రాబాద్‌కు ఎలాగో వచ్చే ఓ పాడుపడిన ఇంటి ఎదుట శనివారం తెల్లారుజామున మృతి చెందాడు. భార్యతోపాటు బంధువులకు పోలీసులు సమాచారమిచ్చినా ఎవరూ రాలేదు. అమ్రాబాద్‌కు చెందిన అబ్దుల్ ఖదీర్, ఇస్మాయిల్ అలీ, హసన్ అలీ, అక్రమ్ ముందుకు వచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి ఖననం చేశారు. చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే చదవండి: టీకా వేసుకున్న భర్త.. ఆ తర్వాత భార్య -
పొలం కుదువపెట్టి..కాయకష్టం చేసినా..
వారిద్దరూ వ్యవసాయాన్నే నమ్ముకున్నారు.. ఒకతను పరిస్థితులు అనుకూలించక ఉన్న పొలాన్ని కుదువపెట్టగా వచ్చిన కొద్దిపాటి డబ్బులు కుటుంబ అవసరాలకే సరిపోయాయి.. గత్యంతరంలేక భార్యాపిల్లల తో కలిసి వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు.. అక్కడ కొంత పొలం కౌలుకు తీసుకునిపంట సాగు చేయగా సరైన దిగుబడి రాలేదు.. చివరకు తమకున్న పశువులను ఆసామి తీసుకోవడంతో మనోవేదనకు గురై తనువు చాలించాడు.. మరోచోట ఇంకో కౌలురైతు చేసిన అప్పలు తీర్చలేక కూతురికి పెళ్లిచేయలేక బలవన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు వీధిన పడ్డారు.. వివరాలిలా ఉన్నాయి. మన్ననూర్ / కొత్తకోట రూరల్ : అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చెందిన కడారి దుర్గయ్య యాదవ్ (45) సమీపంలో మూడెకరాల పొలం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దానిని మరొకరి వద్ద కుదువపెట్టగా కేవలం మూడు వేలు మాత్రమే వచ్చాయి. ఆ డబ్బులు కుటుంబ అవసరాలకే సరిపోయాయి. దీంతో ఏడాదిక్రితం తమకున్న 12 పశువులను తీసుకుని నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తిమ్మాపూర్‌కు భార్యాపిల్లలతో కలిసి వలస వెళ్లాడు. వ్యవసాయంపైనే ఆశలు పెట్టుకున్న అతను అక్కడి ఓ ఆసామి పంటకు పెట్టుబడి పెట్టేలా మాట్లాడుకుని 20 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. అందులో పత్తి సాగు చేశాడు. తన చేతికష్టమంతా ధారపోసినా పత్తి సమయానికి వర్షాలు కురియక పంటంతా దెబ్బతింది. చివరకు పెట్టుబడి కింద పశువులను ఆసామి తీసుకోవడంతో భార్యాపిల్లలతో కలిసి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఆరుగాలం చేసిన కష్టంతో పాటు ఉన్న పశువులు కూడా పోవడంతో రోజూ మదనపడుతుండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు కుమారులు ఆరుబయట ఆడుకుంటుండగా, భార్య వెంకటమ్మ బియ్యం తేవడానికి చౌకధరల దుకాణం వద్దకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన అతను ఇంటి పైకప్పు సీలుకులకు ఉరివేసుకుని చనిపోయాడు. కొద్దిసేపటికి తిరిగొచ్చిన వారు గమనించి బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ పెంటోజీ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ నిమ్మలాశ్రీనివాసులు పరామర్శించి *వేలు ఆర్థికసాయం అందజేశారు. మరో సంఘటనలో ఈ ఏడాది కొత్తకోట మండలం అమడబాకుల గ్రామపంచాయతీ పరిధిలోని సత్యహళ్లికి చెందిన శ్రీనివాసులు (45) సమీపంలో నాలుగెకరాలను కౌలుకు తీసుకున్నాడు. సుమారు *రెండు లక్షలు అప్పుచేసి అందు లో వరి సాగు చేశాడు. ఇటీవల తెగుళ్లు సోకడంతో క్రిమిసంహాకర మందులు చల్లి నా పంట ఎదుగుదలలో మార్పురాలేదు. ఈయనకు భార్య ఈశ్వరమ్మతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో చేసిన అప్పులు తీరకపోవడం, అమ్మాయి పెళ్లి ఎలా చేయాలని మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఈనెల 11వ తేదీ రాత్రి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటా యి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కృష్ణ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.