అమోల్ షిండే అదుర్స్...
సాక్షి, హైదరాబాద్: ఈఎంసీసీతో జరిగిన ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ బౌలర్ అమోల్ షిండే (7/51, 5/34) అద్భుత ప్రదర్శన చేశాడు. ఫలితంగా ఆ జట్టు ఇన్నింగ్స్ 268 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 83/4తో మూడోరోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఈఎంసీసీ జట్టు 53.5 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఈఎంసీసీ జట్టు అమోల్ షిండే ధాటికి 34.5 ఓవర్లలోనే 80 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 51 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన అమోల్ రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఈఎంసీసీ పతనాన్ని శాసించాడు. అంతకుముందు ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌ను 457/9 వద్ద డిక్లేర్ చేసింది. ఈ విజయంతో ఆంధ్రాబ్యాంక్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి.
ఆర్. దయానంద్ ఎలెవన్, డెక్కన్ క్రానికల్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 118/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దిగిన ఆర్. దయానంద్ జట్టు 73 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పి. రోహిత్ రెడ్డి (136 బంతుల్లో 110; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... కుషాల్ పర్వేజ్ జిల్లా (72), లలిత్ మోహన్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన డెక్కన్ క్రానికల్ జట్టు మూడో రోజు ఆటముగిసే సమయానికి 14 ఓవర్లలో 3 వికెట్లకు 50 పరుగులు చేసి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో దయానంద్ జట్టు 204 పరుగులు చేయగా, డెక్కన్ క్రానికల్ జట్టు 177కు ఆలౌటైంది.
ఇతర ఎ–1 డివిజన్ లీగ్ మ్యాచ్‌ల స్కోర్లు
బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 320 (100.4 ఓవర్లలో); ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 343/6 (డానీ డెరెక్ ప్రిన్స్ 87, కేఎస్కే చైతన్య 103 నాటౌట్, అహ్మద్ ఖాద్రి 47, ఆకాశ్ భండారి 50; మొహమ్మద్ ముదస్సిర్ 5/82).
జై హనుమాన్: 332 (కె. రోహిత్ రాయుడు 177 నాటౌట్, జీఎస్ శాండిల్య 62; రక్షణ్ రెడ్డి 4/52); ఇన్‌కంట్యాక్స్: 42/2.
హైదరాబాద్ బాట్లింగ్: 225 (తొలి ఇన్నింగ్స్), 235 (రవీందర్ రెడ్డి 60, జె. వినయ్ గౌడ్ 89; సయ్యద్ మెహదీ హసన్ 3/83, మీర్ ఒమర్ ఖాన్ 3/51); కేంబ్రిడ్జ్ ఎలెవన్: 215 (తొలి ఇన్నింగ్స్), 85/2 (హర్‡్ష జున్‌జున్‌వాలా 40).
ఎవర్గ్రీన్: 285 (తొలి ఇన్నింగ్స్), 175/5 (జి. విక్రమ్ 62, బి. మనోజ్ కుమార్ 61, చందన్ 35); కాంటినెంటల్: 236 (ఎం. సమిత్ రెడ్డి 45; ప్రణీత్‌రెడ్డి 4/29, శుభమ్ 3/48).
ఇండియా సిమెంట్స్: 140 (తొలి ఇన్నింగ్స్), 5/0 (2 ఓవర్లలో); ఏఓసీ: 256/5 డిక్లేర్డ్ (శివమ్ తివారి 52, అమిత్ 122, రవి 36).