breaking news
	
		
	
  Anandapuram Mandal
- 
  
      నేడు విశాఖ జిల్లాలో ‘సమైక్య శంఖారావం’
- 
      
                   
                                 నేడు విశాఖ జిల్లాలో జగన్ ‘సమైక్య శంఖారావం’
 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సమైక్య శంఖారావం’ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శనివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి నేరుగా చోడవరం వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.
 
 చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్‌లో జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరవుతారు.


