anandh
-
మాజీ సీజేఐ ఆనంద్ కన్నుమూత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్(81) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తీవ్ర గుండె పోటు రావటంతో శుక్రవారం ఉదయం ఆనంద్ కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆనంద్ 1998– 2001 కాలంలో పనిచేశారు. 2003–06 కాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. డీకే బసు కేసులో ఖైదీల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తారు. 1936లో కశ్మీర్లో జన్మించిన జస్టిస్ ఆనంద్.. లక్నో వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో లా ప్రాక్టీస్ చేశారు. 1975లో కశ్మీర్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. -
ఎవరెస్ట్ ఎక్కినా.. ర్యాగింగ్ బాధ తప్పలేదు
హైదరాబాద్: అతను ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు, కానీ ర్యాగింగ్ మహమ్మారి నుంచి తప్పించుకోలేక పోయాడు. ఇటీవలే ఎవరెస్ట్ అధిరోహించిన డిగ్రీ విద్యార్థి ఆనంద్‌ను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధించారు. ఈ సంఘటన నిజాం కాలేజీలో బుధవారం చోటు చేసుకుంది. బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న భరత్, శివ తనను ర్యాగింగ్ చేసినట్టు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఆనంద్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీని పై విచారణ చేయాలని అబిడ్స్ సీఐని ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. -
ఎవరెస్ట్ అధిరోహించిన తెలుగు తేజాలు
-
ఇక చావో రేవో
ప్రపంచ చాంపియన్‌షిప్ రెండో అర్ధభాగంలోకి కార్ల్సెన్ 4-2 ఆధిక్యంతో వెళుతున్నాడు. ఆనంద్ వరుసగా రెండు గేమ్‌లు ఓడిపోతాడని ఊహించలేదు. రెండు గేమ్‌ల్లోనూ ‘డ్రా’లకు అవకాశం ఉన్నా ఒత్తిడిలో పోగొట్టుకున్నాడు. ఒకరోజు విశ్రాంతి లభించింది కాబట్టి... ఆనంద్, తన సెకండ్స్ కలిసి ఈ ఓడిన రెండు గేమ్‌లను విశ్లేషిస్తారు. ముఖ్యంగా ఎండ్ గేమ్, మిడిల్ గేమ్‌ల మీద ఇక దృష్టి ఎక్కువగా పెట్టాలి. గత రెండు గేమ్‌ల్లోనూ కార్ల్సెన్ మిడిల్ గేమ్‌లో బాగా ఆడాడు. మరోసారి తెల్లపావులతో ఆడబోతున్న ఆనంద్‌కు ఇది చాలా కీలకమైన గేమ్. ఇక నుంచి ఆనంద్ మిడిల్ గేమ్‌లో అన్క్లియర్ పొజిషన్స్‌తో ఆడాలి. ఆనంద్ తన వ్యూహాన్ని మారుస్తాడా? లేక అలాగే కొనసాగిస్తాడా అనేది చూడాలి. మరోవైపు కార్ల్సెన్ వరుసగా రెండు విజయాలతో ఆనందంగా ఉండి ఉంటాడు. ‘డ్రా’లు కావలసిన గేమ్‌లను గెలవడం ఆటగాడి విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంతో కార్ల్సెన్ సరిపెట్టుకోడు. ఓడిపోయే రిస్క్ లేకుండా చూసుకుంటూ విజయాల కోసం ఆడతాడు. ఒకవేళ కార్ల్సెన్ గనక డిఫెన్సివ్‌గా ఆడితే, అప్పుడు ఆనంద్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఇక ఆనంద్‌కు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.