న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్(81) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తీవ్ర గుండె పోటు రావటంతో శుక్రవారం ఉదయం ఆనంద్ కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆనంద్ 1998– 2001 కాలంలో పనిచేశారు.
2003–06 కాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. డీకే బసు కేసులో ఖైదీల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తారు. 1936లో కశ్మీర్‌లో జన్మించిన జస్టిస్ ఆనంద్.. లక్నో వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో లా ప్రాక్టీస్ చేశారు. 1975లో కశ్మీర్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment