Ananth Narayanan
-
మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే కఠిన నిబంధనలు
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్‌లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్‌పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్‌లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ముందస్తుగా స్ట్రెస్ టెస్ట్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్‌ను ముందస్తుగా నిర్వహించాలని పరిశ్రమను కోరినట్టు సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత్ నారాయణ్ గోపాలకృష్ణన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌పై నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. స్ట్రెస్ టెస్ట్ కేవలం పథకాల కోసమో లేదా ఫండ్స్ సంస్థల కోసమే కాదని.. మొత్తం మ్యూచువల్ ఫండ్ వ్యవస్థకు సంబంధించినదిగా పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక అనిశి్చతులు, ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉపసంహరణ ఒత్తిళ్లు (లిక్విడిటీ రిస్క్) ఎదురైతే.. వాటిని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, పరిశ్రమ ఎలా అధిగమించగలవో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థల (ఏఎంసీల) సన్నద్ధతను ఇది పెంచుతుంది. ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో లిక్విడిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సెబీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల పరిధిలో ఉండే రిస్క్‌పై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు మెరుగైన మార్గాలను గుర్తించేందుకు ఇది సాయపడుతుందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రిస్క్ నిర్వహణ విధానం.. వివిధ పథకాల్లో ఉండే వేర్వేరు రిస్క్ స్థాయిలను ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేర్వేరు రిస్క్ స్థాయిలు ఉన్నప్పటికీ.. చాలా పథకాలకు కేవలం అధిక రిస్క్ ట్యాగ్ వేస్తున్నట్టు చెప్పారు. కనుక ఈ వ్యత్యాసాలను మరింత పారదర్శకంగా తెలియజేయడమే కొత్త వ్యవస్థ లక్ష్యమన్నారు. సులభంగా ఉండాలి.. ‘‘పోర్ట్‌ఫోలియోలో అంతర్లీనంగా ఉండే ఆటుపోట్లను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇందుకు గాను రిస్‌్కలను సులభంగా అర్థం చేసుకునే విధంగా సమాచారం ఉండాలి. పోర్ట్‌ఫోలియో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు ఈ దిశగా మరింత స్పష్టతనిస్తాయి’’అని గోపాలకృష్ణన్ తెలిపారు. కార్యకలాపాలు క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు మరింత కచ్చితత్వంతో సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు సూచించారు. అప్పటికప్పుడే నిధుల బదిలీకి మన వ్యవస్థలు వీలు కలి్పస్తున్న తరుణంలో.. సెటిల్మెంట్ రోజే ఇన్వెస్టర్లకు నిధుల బదిలీ చేయాలా చూడాలన్నారు. విక్రయించిన మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఫండ్స్ సంస్థలు నిధులు బదిలీ చేస్తుండడంతో గోపాలకృష్ణన్ సూచనకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!
ప్రముఖ ఈకామర్స్ బ్రాండ్ మింత్రా సీఈఓగా అనంత్ నారాయణన్ ఇప్పటికే కార్పొరేట్ వర్గాల్లో పాపులర్. కీలక పదవిలో ఉన్నప్పటికీ తన సొంత కంపెనీ ప్రారంభించే సాహసం చేయడమే కాదు ఆరునెలల్లో ఏకంగా రూ. 9,900 కోట్లకుపైగా సంపదను సాధించడం విశేషం. అతి తక్కువ సమయంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూనికార్న్‌గా బిలియన్ డాలర్ల కంపెనీ మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడిగా, రికార్డు సృష్టించిన అనంత్ నారాయణన్ సక్సెస్ స్టోరీ...! కేవలం రెండేళ్ళ వ్యవధిలో రెండు పెద్ద బ్రాండ్ల వ్యవస్థాపకుడిగా ఎంటర్ప్రెన్యూర్ జర్నీని ప్రారంభించిన ఘనత అనంత్నారాయణన్ది. భారతదేశంలో స్టార్టప్‌లకు ఆదరణ లభిస్తున్న సమయంలో అనంత్ నారాయణన్ తన దృష్టిని అటువైపు మళ్లించారు. సౌకర్యవంతమైన పదవిని వదిలేసి భారతదేశపు తొలి ఈ-కామర్స్ 'యునికార్న్' ఆవిష్కారానికి పూనుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి అనంతరం 2021లో మే నెలలో మెన్సా కంపెనీని స్థాపించారు. ఈ వెంచర్ ఒక నెలలోనే తొలి ఫండింగ్‌గా 50 మిలియన్ల డాలర్లను అందుకుంది. ఆరువాతి ఐదు నెలలకే 135 మిలియన్ల డాలర్ల నిధులను సేకరించిన తర్వాత కంపెనీ వాల్యూ బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) Too many flights this week. Mumbai- bangalore- Coimbatore - Delhi - Mumbai - bangalore ! #startuplife pic.twitter.com/mKq17QVRvC — Ananth Narayanan (@ANarayanan24) February 3, 2023 అనంత్ మద్రాస్ మిచిగాన్ విశ్వవిద్యాలయాల నుండి ఉన్నత విద్యాను అభ్యసించారు . ప్రముఖ మెకిన్సే కంపెనీకి కీలక పదవుల్లో పనిచేశారు. ఆ తర్వాత ఫ్యాషన్ రీటైలర్ మింత్రాకి సీఈవోగాను పనిచేశారు. సీఈవోగా అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ మెడ్‌లైఫ్.కామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు. అయితే అనంత్ తొలి వెంచర్‌ను ఫార్మసీ కొనుగోలు చేసింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) అమెరికన్ యునికార్న్ ప్రేరణతో అనంత్ మెన్సా అనే సొంత బ్రాండ్‌తో ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా చిన్న వ్యాపారుల ఉత్పత్తులను ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయిస్తుంది. మెన్సా అనే పదానికి గ్రీకులో కాన్స్టెలేషన్ అని అర్థం. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ల క్లస్టర్ మోడల్‌గా మెన్సాను తీర్చి దిద్దారు. డజనుకు పైగా బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. సంవత్సరానికి 100శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ప్రారంభించిన ఆరు నెలల్లోనే బిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువైన భారతీయ యునికార్న్ గ్రూపులో అత్యంత వేగంగా ప్రవేశించిన స్టార్టప్‌గా నిలిచింది.ఇప్పటికే డజన్ల బ్రాండ్లను కొనుగోలు చేసింది.మెన్సా తన పోర్ట్‌ఫోలియో వృద్ధికి నిధులను ఉపయోగించాలని భావిస్తోందని ఇటీవల నారాయణన్ స్వయంగా వెల్లడించారు. ఇలాంటి మరెన్నో సక్సెస్ స్టోరీలు, ప్రేరణాత్మక కథనాలకోసం చదవండి: సాక్షి బిజినెస్