Ancient civilizations
-
ఈద్ ఉల్ అధా 2024: బిర్యానీ ఎక్కడ పుట్టింది? దీని కథేంటీ..?
బక్రీ ఈద్గా పిలిచే ఈద్ ఉల్ అధా ఈ ఏడాది ఇవాళే(జూన్ 17) బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇది త్యాగానికి గుర్తుగా జరుపుకునే విందు. అబ్రహం ప్రవక్త కొడుకు ఇస్మాయిల్ని బలి ఇవ్వమని కోరడం..దేవుడు జోక్యం చేసుకుని బలిగా పొట్టేలుని ఇవ్వడం గురించి ఖురాన్లో ఒక కథనం ఉంటుంది. అందుకు గుర్తుగా ఈ రోజున పొట్టేలు(మేక) బలి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ..ఒక వ్యక్తి స్థానంలో మరోక జీవిని బలి ఇవ్వడం అనేది.. త్యాగం లేదా ఖుర్బానీ చరిత్రను గౌరవించేందుకు గుర్తుగా ఈ రోజుని ముస్లింలంతా జరుపుకుంటారు. ఈ రోజు మాంసంతో కలిపి వండే బిర్యానీని తయారు చేసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పంచుకుని తింటారు. ఈ పండుగ పురుస్కరించుకుని అసలు ఈ బిర్యానీ ఎక్కడ పుట్టింది..? ఎలా మన భారతదేశానికి పరిచయం అయ్యింది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!భారతదేశంలో అత్యంత మంది ఎక్కువగా ఆర్డర్ చేసే వంటకంగా ప్రసిద్ధ స్థానంలో ఉంది బిర్యానీ. కుల మత భేదాలు లేకుండా ప్రజలంతా ఇష్టంగా తినే వంటకం కూడా బిర్యానీనే. ఇంతలా ప్రజాధరణ కలిగిన ఈ వంటకం చరిత్ర గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!. బిర్యానీ అన్న పదం 'బిరింజ్ బిరియాన్' (ఫ్రైడ్ రైస్) అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్లో పుట్టలేదన్న వాదనా వినిపిస్తుంటుంది. కానీ ఇరాన్లో ధమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపైన చాలా సేపు దాన్ని ఉడికించి, ఆ మాంసంలోని సహజసిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి, ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారుచేస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బిర్యానీ మొఘల్ చక్రవర్తుల ద్వారానే భారత్‌లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేవు. అంతేగాదు దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులూ, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కుమంది చెబుతున్న వాదన. ఏదీఏమైనా..నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ, నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా విభిన్న సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కమ్మని రుచితో చేరువైంది. ఇక చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం..ఈ బిర్యానీ వంటకం మొఘల్ శకం, చక్రవర్తి షాజహాన్ భార్య బేగం ముంతాజ్ మహల్ కాలం నాటిదని ప్రసిద్ధ కథనం. ఆమె ఒకసారి పోషకాహార లోపంతో కనిపించిన సైనిక అధికారులను చూసి, వారి కోసం పోషకమైన, చక్కటి సమతుల్య భోజనాన్ని తయారు చేయమని తన రాజ ఖన్సామాలను (వంటచేసేవాళ్లుకు) ఆదేశించింది. దాని ఫలితంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ బిర్యానీ వంటకం రూపొందిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం..1398లో టర్క్-మంగోల్ విజేత తైమూర్ భారత సరిహద్దులను చేరుకున్నప్పుడు అతని సైన్యం కోసం ఈ బిర్యానీని వినియోగించారిని చెబుతారు. సైనికులు కోసం బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంతో నిండిన కుండను వేడి గొయ్యిలో పాతి పెట్టేవారట. కొంత సమయం తర్వాత తీసి చూడగా బిర్యానీ తయారయ్యి ఉండేదట. ఇది యోధులకు మంచి పోషకాహార భోజనంగా ఉండేదట. ఎక్కువ సేపు ఆకలిని తట్టుకుని ఉండేవారట. ఇక పర్షియన్ పదంలో బిరియన్ అనే పదానికి అర్థం కాల్చడం. బిరింజ్ అంటే అన్నం. పూర్వకాలంలో చాలమంది గొప్ప పండితులు పర్షియా దేశం నుంచి భారతదేశానికి రావడం వల్లే ఈ ప్రత్యేకమైన వంటకం మనకు పరిచయమయ్యిందని చెబుతారు. అయితే మన దేశంలో మాత్రం ఈ బిర్యానీ మాంసం, బియ్యం సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని మాన్సోదన్ అని పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశం అంతటా అనేక రూపాల్లో బిర్యానీ లభిస్తుంది. మన హైదరాబాద్ బిర్యానీ ఉత్తర, దక్షిణ అంశాలను టర్కిష్ ప్రభావాన్ని మిళితం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, లక్నోలలో బాస్మతీ వంటి పొడవైన బియ్యంతో తయారు చేయగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీరగ సాంబ లేదా కైమా బియ్యం వంటి పొట్టి ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రతి బిర్యానీ సుగంధ్ర ద్రవ్యాలు, మాంసంతో ఆయా ప్రాంతాలకు అనుగుణమైన శైలిలో రూపొందుతుంది. ఈ బిర్యానీ వంటకం ఎలా ఏర్పడిందన్నది తెలియకపోయిన మన రోజూవారీ ఆహారంలో అందర్భాగం అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి ఈద్ సమయంలో ప్రతి ముస్లిం ఇంట ఘుమఘమలాడే మటన్ బిర్యానీ ఉండాల్సిందే. (చదవండి: Eid Al-Adha 2024: మౌలిక విధులు..) -
President Droupadi Murmu: వారసత్వ ప్రతీక రామమందిరం
న్యూఢిల్లీ: భారత్ తన పురాతన నాగరికత వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసుకున్న అద్భుత ఘడియగా ‘రామ మందిర నిర్మాణ ఘట్టం’ నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ‘‘ అయోధ్యలో రామమందిర దివ్యధామం ప్రజల విశ్వాసాలను మాత్రమే కాదు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకున్న అచంచల విశ్వాసానికీ నిలువెత్తు నిదర్శనం’’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరునూ ఆమె ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణలు, మానవీయ సంక్షోభాలు, యుద్ధాలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఘర్షణలకు మూలాలను వెతక్కుండా భయాలు, విద్వేషంతో ఆయా దేశాల ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆమె మాటల్లోనే.. జీ20 ఆతిథ్యం ఎన్నో నేరి్పంది ‘‘న్యాయ ప్రక్రియ, సుప్రీంకోర్టు సముచిత తీర్పుల తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బాటలు పడ్డాయి. ఈ ఆలయం నిర్మాణం ద్వారా భారత్ తన నాగరికత వారసత్వ పరంపరను కొనసాగిస్తున్నట్లు మరోమారు ప్రపంచానికి చాటింది. ప్రజల విశ్వాసం మాత్రమే కాదు వారు న్యాయవ్యవస్థ మీద వారికున్న నమ్మకానికి నిదర్శనం ఈ ఆలయం. ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ తన పౌరుల భాగస్వామ్యంలో ఎంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలనైనా నిర్వహించగలదని రుజువు చేసింది. వ్యూహాత్మక, దౌత్య అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి చూపింది. ప్రజలు తమ సొంత భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోగలరో ప్రపంచ దేశాలకు నేరి్పంది. గ్లోబల్ సౌత్‌కు భారత్ గొంతుకగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో ధృఢ విశ్వాసంతో భారత్ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తోంది’’ అని అన్నారు. అభివృద్ధి భారత్ బాధ్యత పౌరులదే ‘‘ స్వతంత్రభారతావని 75 వసంతాలు పూర్తిచేసుకుని శత స్వాతంత్రోత్సవాల దిశగా అడుగులేస్తోంది. రాబోయే పాతికేళ్ల అమృత్‌కాలంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన భారత్‌గా దేశాన్ని నిలపాల్సిన బాధ్యత పౌరులదే. ఇప్పుడు మహాత్ముని మాటలు గుర్తొస్తున్నాయి. దేశంలో ప్రజలు ప్రాథమిక హక్కులు గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదు. ప్రాథమిక విధులు సైతం ఖచి్చతంగా నిర్వర్తిస్తూ బాధ్యతగా మెలిగినప్పుడే భారత్ అభివృద్ది చెందుతుందని గాం«దీజీ ఉపదేశించారు’’ అని ముర్ము గుర్తుచేశారు. -
మనిషి చెప్పులు వేసుకున్నది ఎన్నడు? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు!
నాగరకత తొలినాళ్లలో మనిషి తన శరీరాన్ని రక్షించుకునేందుకు దుస్తులు వాడటం మొదలుపెట్టాడు. మరి కాలికి వేసుకునే చెప్పులు, బూట్ల వాడకం మొదలైందెన్నడు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? దీనికి ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాధానం కనుగొన్నారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇది మానవజాతి చరిత్రలోని అత్యంత పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మానవులు మధ్య రాతి యుగంలోనే బూట్లు ధరించి ఉండవచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నాటి కాలాన్ని మెసోలిథిక్ టైమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికన్ పూర్వ చరిత్రలో ఒకనాటి కాలం. ఈ నూతన ఆవిష్కరణ 75 వేల నుంచి ఒక లక్షా 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రకారం పురాతన మానవులు.. మనం ఇంతవరకూ భావిస్తున్నదానికన్నా ఎంతో నేర్పరులని తేలింది. ఈస్ట్ హార్ట్‌ఫోర్డ్‌లోని గుడ్విన్ యూనివర్శిటీకి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రాండీ లైస్ట్ ఒక వ్యాసంలో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణల్లో షూస్ అంటే బూట్లు ఒకటని తెలిపారు. ఈ వివరాలు 2020 ఆగస్టులో ప్రచురితమయ్యాయి. కార్లు, పడవలు, రాకెట్ షిప్‌ల వంటి వాహనాలు భారీ పరమాణంలోని బూట్ల మాదిరిగా ఉంటాయని లైస్ట్ దానిలో పేర్కొన్నారు. బూట్ల ఆలోచన నుంచే ఇటువంటి ఇటువంటి సాంతకేతికత ఆవిర్భవించిందని లైస్ట్ భావించారు. మానవజాతి ప్రారంభ సాంకేతిక ఆవిష్కరణలలో బూట్లు ఒకటి. గత పురావస్తు పరిశోధనలలో బూట్లు దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివని, ఇవి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చాయని భావించారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో సాగిన నూతన పరిశోధనలు బూట్ల ఆవిష్కరణకు సంబంధించిన పాత సిద్ధాంతాలను తుడిచిపెట్టాయి. విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు బెర్న్‌హార్డ్ జిప్‌ఫెల్ వెల్లడించిన వివరాల ప్రకారం మధ్య రాతి యుగంలో కేప్ తీరం వెంబడి బీచ్‌లో పురాతన మానవుల పాదముద్రల శిలాజాలను పరిశీలించినప్పుడు, వారు బూట్లు ధరించి ఉండవచ్చని పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. సదరన్ కేప్ కోస్ట్ ఆ సమయంలో చాలా పదునైన రాళ్లతో ఉండేదని, ఇవి బాధ కలిగించకుండా ఉండేందుకు నాటి మానవులు పాదరక్షలను ఉపయోగించి ఉండవచ్చని ఆయన అన్నారు. అయితే పురాతన మానవులు ఏ రకమైన బూట్లు ధరించారనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు నేటికీ స్పష్టంగా ఏమీ తెలుసుకోలేకపోయారు. పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదరక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పరిశోధనలు సాగిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జిప్‌ఫెల్ స్పందిస్తూ నాటి పురాతన బూట్లు ఇంత కాలం ఉండకపోవచ్చని, నాటి మానవులు పాదముద్రల శిలాజాలు కనుగొనగలిగితే పూర్వీకులు ధరించిన పాదరక్షల గురించి అధ్యయనం చేయడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. నాటి మానవులు బూట్లు ధరించారా లేదా అనేదానిని తెలుసుకునేందుకు పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాలలో నాటి మనిషి ఎముకల ఆకారం, పరిమాణాన్ని విశ్లేషించారు. అక్కడ నివసించే ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా, తక్కువ దృఢంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. కాలి స్వరూపంలో ఈ మార్పు బూట్లు ధరించడం వల్ల సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. షూస్ అనేవి పదునైన రాళ్లు, ముళ్లు, పరాన్నజీవుల నుండి రక్షణను అందిస్తాయి. ఈ అధ్యయనం మధ్య రాతి యుగంనాటి మానవుల సాంస్కృతిక చరిత్ర, పరిజ్ఞానాలను మరింతగా తెలియజేలా ఉంది. ఆ కాలంలో జరిగిన బూట్ల ఆవిష్కరణ, వాటి ఉపయోగం నాటి విస్తృత సాంస్కృతిక మార్పులో భాగంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
భువన విజయంతో ‘అనంత’ ఖ్యాతి
అనంతపురం కల్చరల్: పురావస్తు సంపదను భావితరాలకు పదిలంగా అందించడానికి రాష్ట్ర, జాతీయ పురావస్తు శాఖలు నడుంబిగించాయి. అనంతపురం జిల్లా పెనుకొండలో ‘భువన విజయం’ పేరుతో జాతీయ మ్యూజియం ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి పర్యాటకులను రప్పించడానికి సంకల్పించాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ ప్రాచీన కట్టడాలు, శిలా శాసనాలు, సంస్కృతీ కేంద్రాల పరిరక్షణకు పురావస్తు శాఖ అధికారులు ముమ్ముర చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి ఏర్పాటు కానున్న జాతీయ మ్యూజియంను దాదాపు రూ.9 కోట్లతో నిర్మించడానికి పెనుకొండ డీఎస్పీ బంగ్లా సమీపంలో 83 సెంట్ల స్థలాన్ని సేకరించారు. త్వరలోనే పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మ్యూజియంలో అపురూప కట్టడాల అవశేషాలు, నాణేలతోపాటు శ్రీకృష్ణదేవరాయల కీర్తిని చాటే శాసనాలను కూడా భద్రపరుస్తారు. జంబూద్వీపానికి ఆధునిక కళ అనంతపురం జిల్లాలోని కొనగండ్ల ప్రాంతంలో ఆకర్షించే కట్టడాలలో.. రససిద్ధుల గుట్టగా ప్రఖ్యాతి చెందిన జంబూద్వీపం చక్రం ఒకటి. ఇక్కడ ప్రపంచంలోనే అరుదైన జైన మత అవశేషాలు బయటపడ్డాయి. ముంబైకి చెందిన ‘దిగంబర్ జైన్స్ కమిటీ’ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా మ్యూజియం అధికారులు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకున్నారు. త్వరలో సందర్శకులకు అన్ని వసతుల ఏర్పాట్లు కానున్నాయి. ముఖ్యంగా జైన్ విగ్రహాలకు కాయకల్పం(శాశ్వతంగా రక్షించడానికి వజ్రలేపనం పేరుతో ప్రకృతి సిద్ధమైన రసాయనాలతో పూత) చేయడానికి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధికి ప్రణాళిక.. - ప్రాచీన కట్టడాలకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు ఉండరాదన్న నిబంధనను మ్యూజియం ఆధికారులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. - ప్రపంచంలోనే అపురూప శిల్పంగా పేరున్న లేపాక్షి నందికి సమీపంలో నిర్మిస్తున్న రోడ్డును ఆపివేయించారు. - పెనుకొండలోని గగన్‌మహల్‌కు సమీపంలో సాయి కాళేశ్వర్ ట్రస్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. - ప్రాచీన కట్టడాలకు నిలయమైన పెనుకొండ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. - రాయదుర్గం వద్దనున్న పశుపతనాథ ఆలయం, వేపులపర్తి శ్రీరంగనాథ దేవాలయం, పెనుకొండ దీప స్తంభం, తిమ్మరుసు సమాధి ప్రాంతాలలో అభివృద్ధి పనులు, గోరంట్ల యాష్ మౌంట్స్ (బూడిద దిబ్బలు) వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో రక్షణ కోసం ఫెన్సింగ్ పనులు చేపట్టనున్నారు. చారిత్రక కట్టడాల రక్షణకు ప్రాధాన్యం అనంతపురం జిల్లాలో జాతీయ మ్యూజియం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మరింత ఖ్యాతి వస్తుంది. పురావస్తు కేంద్రాల వద్ద సౌకర్యాలను కల్పించడం ద్వారా సందర్శకులను మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికనుగుణంగా జిల్లాలో పెనుకొండ, కొనకొండ్ల, వేపులపర్తి, గోరంట్ల వంటి అనేక చోట్ల అభివృద్ధి పనులను చేస్తున్నాం. ముఖ్యంగా ప్రాచీనమైన వాటి రక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం. – రజిత, ఏడీ, జిల్లా పురావస్తు శాఖ -
టూకీగా ప్రపంచ చరిత్ర 46
ఈజిప్టు, మెసొపొటేమియాల కంటే మిక్కిలి విస్తారమైన ప్రాచీన నాగరికత సింధూ పీఠభూమిది. మెసొపొటేమియాకు మల్లే ఇది జంట నదుల నాగరికత. ఈ జంటలో ప్రధానమైంది సింధూ నది. దీనికి సమాంతరంగా ఒకప్పుడు తూర్పుపార్శ్వంలో ప్రవహించిన ఘగ్గర్-హాక్రా (Ghaggar-Hakra) నది ఇప్పుడు అంతర్థానమైంది. దీని ఉనికి కేవలం శాటిలైట్ చిత్రం ద్వారా తెలుసుకోవలసిందే. బహుకాలంగా చరిత్రకారుల నిర్లక్ష్యానికి గురి కావడంతో సింధూ నాగరికతకు సంబంధించిన సమాచారం మనకు దొరకుతున్నది అరకొరగానే. దొరికిన కొద్దిపాటి సమాచారంతోనే ప్రపంచానికి అబ్బురపాటు కలిగించిన నాగరికత సింధూ పీఠభూమిది. నేటి పాకిస్థాన్‌లోని ‘క్వెట్టా’ పట్టణానికి సమీపంలో, క్రీ.పూ. 7000 కాలం నాటి ‘మెహ్గ్రర్ (క్ఛజిటజట్చజి)లో బార్లీతో పాటు గోధుమ సాగైనట్టు తెలియడమే కాకుండా, మొట్టమొదటిగా ‘పత్తి’ (ఇౌౌ్ట్ట) ఆనవాళ్లు కనిపించింది ఇక్కడే. ‘సింధూ’ అనే పదానికి పర్షియన్ భాషలో సమానార్థకం ‘హిందూ’. ఆ కారణంగా గ్రీకులు, ఇరానియన్లు ఈ ప్రాంతాన్ని ‘హిందూ’ దేశంగా వ్యవహరించడంతో ఆ పేరే చరిత్రలో కొనసాగింది. మెసొపొటేమియాకు మల్లే సింధూ నాగరికతలో కూడా ఇంటి నిర్మాణాలకు వాడింది ఇటుకేగాని, ఇవి కాల్చిన ఇటుకలు. చక్కని వ్యూహరచనతో నిర్మితమైన పట్టణాలూ, ప్రతి ఇంటిని అనుసంధానం చేసే మురుగునీటి తరలింపు సౌకర్యం ఈ నాగరికత విశేషాలు. ఆ రోజుల్లో ఎక్కడా కనిపించని విధంగా ఇక్కడ ఇంటింటికి ఒక బావి, ఒక స్నానాల గది ఉండటం చూస్తే, ఇక్కడి వాతావరణంలోని తేమ, వేడి కారణంగా ఈ నాగరికులు స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టే కనిపిస్తుంది. వీటికి తోడు నగరం మధ్యలో కోనేరు. దాని ప్రయోజనం తెలీక పాశ్చాత్య పురావస్తు నిపుణులు దాన్ని పుణ్యస్నానాలకు ఉపయోగించే ‘గ్రేట్ బాత్’ (ఎట్ఛ్చ్ట ఆ్చ్టజి)గా భావించారు. వాస్తవానికి అది నగరవాసుల మంచి నీటి సౌకర్యం కోసం ఏర్పాటైన సదుపాయం. ఊట బావి నీరు మట్టిలోని లవణాలను అంతో ఇంతో కరిగించుకోవడంతో జవుకులుగా మారే అవకాశమున్న కారణంగా, వాటిని తాగేందుకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటూ, ఇటుకలతో కట్టిన కాలవద్వారా ఏటి నీరు నేరుగా కోనేటికి చేర్చుకుని, వాటిని తాగేందుకు ఉపయోగించడం ఇటీవలి కాలం దాకా దక్షిణ భారతదేశంలో సంప్రదాయంగా ఉండేది. కోనేర్లు రెండు రకాలవి మనకు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. దేవాలయాల దగ్గర కనిపించే కోనేర్లకు తీరం పొడవునా, చుట్టూరా మెట్లుంటాయి. ఇవి స్నానాలకు ఉపయోగించేవి. మంచి నీటి కోనేర్లు సాధారణంగా దీర్ఘచతురస్రాలు. ఇరువైపులా వెడల్పు తక్కువుండే భుజాల్లో మాత్రమే వీటికి మెట్లుంటాయి. మొహెంజదారోలో కనిపించే గ్రేట్బాత్ అచ్చం ఈ తరహాదే. ప్రపంచంలో ఎక్కడా కనిపించనన్ని ధాన్యపు రకాలకు సింధూ పీఠభూమి ఆలవాలం. గోధుమ, బార్లీ, రాగి, జొన్న, సజ్జలతో పాటు జీలకర్ర ప్రమాణంలో ఉండే బియ్యం తదితరాలు తృణధాన్యాలు; కంది, పెసర, శెనగ, ఉలవ, అనుము, మినుము, అలసంద తదితరాలు పప్పుదినుసులు; నువ్వులు, ఆవాలు, అవిసె, వేరుశనగ వంటివి చమురుగింజలు; వీటికి తోడు పలురకాల దంపులు, కూరగాయలు, పోపుదినుసులు విస్తారంగా పండేవి. పైరుగా కాక, నదీతీరాల్ల పొదలుపొదలుగా చెరుకు యదేచ్ఛగా పెరిగేది. బహుశా ఈ పంటల సమృద్ధి కారణంగా కావచ్చు, శాకాహారానికి ప్రాముఖ్యత పెరిగి, సింధూప్రాంత నివాసాల్లో జంతుబలి ప్రాధాన్యత తగ్గినట్టు కనిపిస్తుంది. ఖనిజ సంపదలో పలురకాల రంగురాళ్లు కనిపిస్తాయే తప్ప, లోహాలు అరుదు. సింధూ నది ఎగువ ప్రాంతంలో దొరికే కొద్దిపాటి బంగారు మినహా, మిగతా ఏ లోహమూ ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో అందుబాటు కాదు. అందువల్లే ఈ పురాతన నగరాల్లో లోహపరిశ్రమకు చెందిన ఆనవాళ్లు తక్కువగానూ, రంగురాళ్లను పూసలుగా తయారుజేసే పరిశ్రమలు ఎక్కువగానూ కనిపిస్తాయి. అనాది నుండి ఈ నాగరికత వైఢూర్యాలకు ప్రసిద్ధి. ఈ రంగుపూసల అమ్మకం కోసమే ఇక్కడి వారికి మెసొపొటేమియాతో వ్యాపార సంబంధం ఏర్పడింది. గిరాకీని అందుకునే స్థాయికి వృత్తికర్మాగారం పెరిగింది. అంతేగాదు, సరుకు నాణ్యతను ధృవీకరించే ‘బ్రాండింగ్ పద్ధతి కూడా అమలులో ఉండేదని నిరూపించే ఆధారాలు ఆ త్రవ్వకాల్లో బయట పడిన ముద్రికా పరికాలు (seals). రచన: ఎం.వి.రమణారెడ్డి