'సినీ పరిశ్రమను రెండు కులాలు శాసిస్తున్నాయి'
హైదరాబాద్: సినీ పరిశ్రమలో వర్థమాన నటులు కనుమరుగవడానికి కులాధిపత్యమే కారణమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆరోపించింది. తెలుగు సినీ పరిశ్రమను రెండు కులాలు శాసిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఆరోపించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయ్ కిరణ్ కొంత మంది పెద్దలు తొక్కేసారని ఆరోపించారు. ఉదయ్‌కిరణ్ ఈ దుస్థితికి రావడానికి కారణమైనవారేవరో రాష్ట్రప్రజలందరికి తెలుసునని అన్నారు.
కాగా, ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని అగ్ర హీరోలెవరూ సందర్శించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని పట్టించుకునేవానే కరువయ్యారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.