'పుష్కరఘాట్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తాం'
రాజమండ్రి : గోదావరి పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి అవరసమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం రాజమండ్రిలో దేవినేని ఉమా పర్యటించారు. అందులోభాగంగా పుష్కరఘాట్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని తెలిపారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగర రూరల్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతోపాటు పలువురు నేతలు, టీడీపీ కార్యకర్తలు మంత్రి దేవినేని ఉమా వెంటనే ఉన్నారు.