Andhrapori
-
‘నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి’
పాల్వంచ రూరల్: 'నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటిస్తున్నాను. నా పేరు వెనుక నాన్న గారు పూరి జగన్నాథ్ పేరు ఉంది. ఆంధ్రాపోరి చిత్రం ఇటు తెలంగాణ, ఆటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాష్ట్రాలలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. మూడు సంవత్సరాల పాటు విదేశాలలో నటనపై శిక్షిణ పొందిన అనంతరం మళ్లి సినిమాలలో నటిస్తా. నేను తొలిసారి హీరోగా నటించిన చిత్రం షూటింగ్ జరుపుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను' అని 'ఆంధ్రాపోరి' హీరో ఆకాష్ పూరి అన్నారు. ఆంధ్రాపోరి చిత్రం యూనిట్ మంగళవారం పాల్వంచలో సందడి చేసింది. ఎల్వి. ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్ర హీరో ఆకాశ్పూరితోపాటు నిర్మాత మహేష్, సంగీత దర్శకులు ప్రవీణ్ వనమాల, పాటల రచయిత జోశ్య భట్ల బృందం మంగళవారం నవభారత్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని, పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆంధ్రాపోరి చిత్రం ప్రదర్శిస్తున్న శాంతి థియేటర్‌కు చేరుకున్నారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశారు. థియేటర్ స్క్రీన్ వద్దకు వెళ్లిన ఆకాశ్‌పూరి ప్రేక్షకులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. ప్రేక్షకలనుద్దేశించి మాట్లాడుతూ ప్రేక్షకులకు, పాల్వంచ ప్రజలకు, చిత్రంలో నటించిన స్థానిక కళకారులకు రుణపడి ఉంటానని అన్నారు. చిత్ర నిర్మాత మహేష్ మాట్లాడుతూ ఆంధ్రాపోరి చిత్రం తెలంగాణ, ఆంధ్రాలో విజయవంతమైందన్నారు. ఆంధ్రాపోరికి సీక్వెల్ తీయనున్నట్లు తెలిపారు. చిత్ర యూనిట్‌తో స్థానిక కళాకారులు సైదులు, శ్రీనివాస్,శిరిష, సునిత, రత్నబారుు, ఎండి యాకూబ్, నాగేందర్ పాల్గొన్నారు. -
‘ఆంధ్రాపోరి’ని మార్చండి
సినిమా పేరు మార్చాలని హైకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రాపోరి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా పేరు ఏపీకి చెందిన యువతుల కుటుంబాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, అందువల్ల పేరును మార్చేలా నిర్మాతలను ఆదేశించాలని కోరుతూ ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు వీరరాఘవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్.. సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ..ఎస్పీకి అటాచ్మెంట్
ఖమ్మం : 'ఆంధ్రాపోరి' సినీ యూనిట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐ షణ్ముఖాచారిని జిల్లా ఎస్పీకి అటాచ్మెంట్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 20 రోజులుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా 'ఆంధ్రాపోరి' సినిమా పాల్వంచలో షూటింగ్ చేస్తున్నారు. భద్రాచలం రోడ్‌లోని బృందావన్ రెస్టారెంట్లో చిత్ర యూనిట్ బస చేసింది. అయిదు రోజుల క్రితం రాత్రివేళ ఎస్ఐ ఆ రెస్టారెంట్‌కు వెళ్లి చిత్ర బృందంతో అసభ్యకరంగా ప్రవర్తించారు. పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్ఐని ఎస్పీకి అటాచ్ చేసి ...సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. -
పూరీ జగన్నాథ్ తనయుడు హీరోగా 'ఆంధ్ర పోరీ'
పూరి ఆకాశ్ బాలనటునిగా ఉన్నప్పుడే... ‘భవిష్యత్ హీరో’గా ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. ‘చిరుత, బుజ్జిగాడు... మేడిన్ చెన్నై, గబ్బర్‌సింగ్, ధోనీ’ తదితర చిత్రాల్లో బాలనటునిగా ఆకాశ్ కనబరిచిన అభినయమే దానికి కారణం. పసి వయసులోనే మాస్ మెచ్చే అభినయాన్ని కనబరిచి, తనపై ఉన్న అంచనాలను పెంచేశాడు ఆకాశ్. ఈ చిచ్చరపిడుగు హీరోగా మారే ఘడియ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కూడా లేకపోలేదు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెరదించుతూ హీరోగా ఆకాశ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. అయితే... అందరూ ఊహించినట్లు ఈ చిత్రానికి తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకుడు కాదు. ‘ఋషి’ ఫేం రాజ్ ముదిరాజ్ దర్శకుడు. సినిమా పేరు ‘ఆంధ్రాపోరి’. ప్రసాద్ సంస్థల అధినేత ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. పూరీ దంపతులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందతోన్న ఈ చిత్రంలో ఆకాశ్‌కు జోడీగా ఉల్కా గుప్తా నటిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.