సినిమా పేరు మార్చాలని హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రాపోరి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా పేరు ఏపీకి చెందిన యువతుల కుటుంబాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, అందువల్ల పేరును మార్చేలా నిర్మాతలను ఆదేశించాలని కోరుతూ ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు వీరరాఘవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్.. సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
‘ఆంధ్రాపోరి’ని మార్చండి
Published Thu, Jun 4 2015 1:53 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
Advertisement
Advertisement