బటన్ నొక్కితే చాలు.. హెచ్చరిస్తుంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న ఐబాల్ తాజా గా ఎస్వోఎస్ బటన్ తో కూడిన స్మార్ట్ఫోన్ ‘ఆండీ ఉద్దాన్’ను ఆవిష్కరించింది. ఆపదలో ఉన్నవారు ఫోన్కు వెనుక వైపున్న ఎస్వోఎస్ బటన్ను నొక్కితే చాలు. అది వెంటనే పెద్దగా శబ్దం చేస్తూ చుట్టుపక్కల వారిని హెచ్చరిస్తుంది.
అంతేగాక ముందుగా నిర్దేశించిన అయిదు నంబర్లకు ఫోన్ కాల్ వెళ్తుంది. అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ ఎస్ఎంఎస్ పంపిస్తుంది. జియోకోడ్స్ ఆధారంగా ప్రమాదంలో చిక్కుకున్నవారు ఎక్కడున్నారో ఎస్ఎంఎస్లో ఉంటుంది. ఫేస్బుక్ కు సైతం అప్డేట్ను పంపుతుంది. మహిళల కోసం దేశంలో తయారైన మొట్టమొదటి సేఫ్టీ స్మార్ట్ఫోన్ ఇదేనని కంపెనీ అంటోంది. ఇందులోని ‘ఐస్’ అప్లికేషన్లో బ్లడ్ గ్రూపు, వైద్య చరిత్ర, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లలను జోడించవచ్చు. ధర రూ.8,999. ఆన్డ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్, 5 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉన్నాయి. 1.3 గిగాహెర్ట్జ్ప్రాసెసర్, 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.