breaking news
Andy Pycroft
-
ఓడిపోయామన్న బాధ లేదు.. నేనే గనుక అక్కడి ఉంటేనా..! కథ వేరే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ లేకుండా.. కేవలం ‘నో- షేక్‌హ్యాండ్’ మీద రాద్ధాంతం చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డాడు. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తప్పేమీ లేదని.. తానే గనుక అతడి స్థానంలో ఉంటే పాక్ జట్టుతోనే సారీ చెప్పించుకునేవాడినని అశూ అన్నాడు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) జట్లు ఆసియా కప్ టీ20-2025లో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా గత ఆదివారం (సెప్టెంబరు 14) జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామాఈ విషయాన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహారశైలిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇక ముందు పాక్ ఆడే మ్యాచ్‌లకు రిఫరీగా ఆయనను తొలగించాలని కోరింది. లేదంటే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామా చేసింది. అయితే, ఐసీసీ దిగిరాకపోగా.. యూఏఈతో పాక్ మ్యాచ్‌లోనూ ఆండీనే కొనసాగించింది. అంతేకాదు.. తదుపరి సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 21) నాటి భారత్- పాక్ పోరులోనే అతడినే రిఫరీగా ఎంపిక చేసింది.స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?ఈ నేపథ్యంలో పాక్ వ్యవహారశైలిపై అశ్విన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ‘‘నిజానికి మీ పరువు పోకుండా ఆండీ పైక్రాఫ్ట్ మిమ్మల్ని కాపాడారు. తాము హ్యాండ్‌షేక్ చేయమన్న విషయాన్ని టీమిండియా ముందుగానే రిఫరీకి చెప్పింది. అదే విషయాన్ని ఆయన మీకు చెప్పారు. అంతే. కానీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మీరు చేసిన డ్రామా ఏంటి? అసలు దేని గురించి మీ రాద్ధాంతం?..అయినా ఆండీ పైక్రాఫ్ట్ ఏమైనా స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?.. సూర్య దగ్గరికి వెళ్లి.. ‘రండి.. వచ్చి కరచాలనం చేయండి’ అని చెప్పాలా? ఆయన పని అది కాదు కదా!.. కాబట్టి ఇందులో మీకు ఆయన తప్పు ఎక్కడ కనిపించింది? మీతోనే సారీ చెప్పించుకునేవాడినినేనే గనుక ఆండీ స్థానంలో ఉండి ఉంటే.. ఇలా చేసినందుకు మీతోనే సారీ చెప్పించుకునేవాడిని. ఆయన మీకెందుకు క్షమాపణ చెప్పాలి?’’ అంటూ పాక్ క్రికెట్ బోర్డు తీరును అశ్విన్ ఏకిపారేశాడు. కాగా యూఏఈతో మ్యాచ్‌కు ముందు బాయ్‌కాట్ నాటకం ఆడిన పాక్.. ఐసీసీ దిగిరాకపోవడంతో రిఫరీ ఆండీ తమకు క్షమాపణలు చెప్పాడంటూ ఆడియోలేని ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. -
Asia Cup 2025: భారత్‌తో సూపర్-4 మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ పంచ్..!
ఆసియా కప్ 2025లో భాగంగా రేపు (సెప్టెంబర్ 21) భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ పంచ్ పడినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదంలో పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వలేదు (టాస్ సందర్భంగా, మ్యాచ్ అయిపోయాక). దీన్ని అవమానంగా భావించిన పీసీబీ భారత ఆటగాళ్లను ఏమీ చేసుకోలేక, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌పై పడింది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల పట్ల పక్షపాతంగా (తమ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వరన్న భారత మేనేజ్మెంట్ సందేశాన్ని పాక్ కెప్టెన్‌కు చేరవేశాడని) వ్యవహరించి, క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని ఆరోపించింది.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐసీసీకి పలు లేఖలు రాసింది. యూఏఈతో మ్యాచ్‌కు ముందు ఓ అడుగు ముందుకేసి బాయ్‌కాట్ బెదిరింపులకు దిగింది. ఐసీసీ కన్నెర్ర చేయడంతో కనీసం తమ మ్యాచ్‌లకైనా పైక్రాఫ్ట్‌ను పక్కన పెట్టాలని కాళ్ల బేరానికి వచ్చింది.పీసీబీ ఉడత ఊపులను, డిమాండ్లను తోసిపుచ్చిన ఐసీసీ, పైక్రాఫ్ట్‌కు మద్దతుగా నిలిచింది. అతన్నే యూఏఈతో మ్యాచ్‌కు రిఫరీగా కొనసాగించింది. ఒకవేళ పాక్ జట్టు ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలనుకుంటే భారీ మొత్తంలో నగదు చెల్లించాలని రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా తాజాగా మరో షాక్ ఇచ్చింది.గత మ్యాచ్ తాలూకా గాయాలు తగ్గకముందే రేపు భారత్‌తో జరుగబోయే సూపర్-4 మ్యాచ్‌కు మరోసారి పైక్రాఫ్ట్‌నే రిఫరీగా నియమించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ మేరకు ఐసీసీ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ కొట్టిన ఈ చావుదెబ్బకు సూపర్-4 మ్యాచ్‌కు ముందే పాక్ ఢీలా పడిపోయింది. కాగా, రేపటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. -
అందుకే ఆసియా కప్‌లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!
‘నో- షేక్‌హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్‌కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్‌కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్‌తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్‌కాట్‌కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్‌తో మాట్లాడారు. నో- షేక్‌హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్‌కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్‌కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
అంపైర్‌పైకి బంతిని విసిరిన పాక్ ఫీల్డర్.. తర్వాత ఏమైందంటే?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు- మ్యాచ్ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్‌హ్యాండ్’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)తో మ్యాచ్ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్ అంపైర్‌ను గాయపరిచింది.ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్ ఫీల్డర్ చేసిన పని కారణంగా సదరు అంపైర్ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ధ్రువ్ పరాశర్ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.అంపైర్‌పైకి పాక్ ఫీల్డర్ త్రో.. బలంగా తాకిన బంతిఓవర్ ఐదో బంతిని థర్డ్‌మ్యాన్ రీజర్ దిశగా తరలించిన పరాశర్.. సింగిల్ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్ అంపైర్ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్ ఆయుబ్ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.తర్వాత ఏమైందంటే?అదే విధంగా పాక్ ఫిజియో వచ్చి అంపైర్‌కు కంకషన్ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్ అంపైర్ గాజీ సోహెల్ (బంగ్లాదేశ్) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. Andy Pycroft- just missedRuchira - successRevenge from the previous game against India.. #Uaevpak pic.twitter.com/CY1hb7N8KM— Nibraz Ramzan (@nibraz88cricket) September 17, 2025 ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదుకాగా భారత ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్ బరిలోకి దిగింది.భారత క్రికెటర్లు తమతో కరచాలనం చేయకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిలువరించారని, ఆయనను ఆసియా కప్ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్ ఆడిన మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.‘క్షమాపణ’ చెప్పారంటూ...ఈ మ్యాచ్ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్ మేనేజ్మెంట్ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్ జట్టు.. సూపర్-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్‌లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్-ఎ టేబుల్ టాపర్‌గా టీమిండియా ముందుగానే సూపర్-4కు చేరగా.. పాక్ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే? Not textbook, but definitely effective 💥Watch the #DPWorldAsiaCup, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork pic.twitter.com/n31XKIwlah— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
Asia Cup 2025: పాక్ 'బాయ్‌కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్‌షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్‌ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్‌లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్‌షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్‌ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్‌కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్‌లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్‌కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్‌ల వరకైనా ఆండీ క్రాఫ్ట్‌ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్‌పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్‌పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్