అంగన్వాడీలో పౌష్టికాహార పదార్థాల ప్రదర్శన
తిలకించిన ఎమ్మెల్యే, జెడ్పీచైర్‌పర్సన్
రఘునాథపాలెం: మండల పరిధిలోని సూర్యతండా అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండల ఐసీడీఎస్ అధికారులు ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాల ప్రదర్శనను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ,జెడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవితలు తిలకించారు.మంగళవారం అంగన్వాడీ కేంద్రం భవనం ప్రారంభించిన ఆనంతరం అంగన్వాడీ కార్యకర్తలు సొంతంగా తయారు చేసిన పదార్థాలను వారు రుచి చూశారు. ప్రదర్శనను తిలకించిన వారిలో ఎంపీపీ మాలోత్ శాంత,జెడ్పీటీసీ ఆజ్మీరా వీరునాయక్, సర్పంచ్ జాటోత్ దేవ్లీ, సూర్య, లాల్‌సింగ్, పిన్ని కోటేశ్వర వవు, ఆత్మ చైర్మన్ మెంటం రామారావు, సొసైటీ చైర్మన్ తుమ్మల పల్లి మోహన్‌రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ సామ్రాజ్యం, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.