ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగా...
‘‘ ‘ఆ నలుగురు’ చరిత్రలో నిలిచిపోయిన సినిమా. అందులో హీరో రఘురామ్ సమాజం కోసం ఆలోచించే మనిషి. అలాంటి వ్యక్తే వయసు తగ్గి ముఖ్యమంత్రి అయితే సమాజానికి ఎలాంటి సేవ చేస్తాడనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శకుడు అనిల్ జాసన్ గూడూరు తెలిపారు. వెంకట్ కీలకపాత్ర పోషించిన చిత్రం ‘ఆ ఐదుగురు’. క్రాంతి, క్రాంతికుమార్, తనిష్క్ రెడ్డి, కృష్ణతేజ, శశి, అస్మితా సూద్ ఇందులో ముఖ్య తారలు.
ప్రేమ్ మూవీస్ పతాకంపై సరితా పట్రా నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రేమ్‌కుమార్ పట్రా మాట్లాడుతూ -‘‘ ‘ఆ నలుగురు, వినాయకుడు చిత్రాలతో ప్రజల ప్రశంసలతో పాటు అనేక పురస్కారాలు గెలుచుకున్నాం. మా సంస్థ ఇమేజ్‌ని మరింత నిలబెట్టే విధంగా ఈ ‘ఆ ఐదుగురు’ ఉంటుంది. సామాజిక స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మా నటీనటులకు పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: పీజీ విందా, సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్‌కుమార్ పట్రా.