Anil John
-
ఆ ఒక్కటి అడగొద్దు
హీరోయిన్లు ఒక విషయం మినహా వేటి గురించి అయినా చకచకా, కామాలు, ఫుల్‌స్టాప్‌లు లేకుండా చెప్పేస్తుంటారు. ఆ ఒక్క విషయం అంటే వ్యక్తిగతం. ఈ అంశానికొచ్చేసరికి ముఖంలో రంగులు మారిపోతాయి. నటి మీరాజాస్మిన్ ఇందుకు అతీతం కాదు. ఈమె గత ఏడాది ఐటీ కంపెనీలో పనిచేసే అనిల్‌జాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చట్టబద్ధం చేయడంలో సమస్యలు తలెత్తుతాయనే ప్రచారం హోరెత్తుతోంది. కారణం అనిల్జాన్కు ఇంతకుముందే వేరే యువతితో వివాహం జరిగిన విషయం తెల్సిందే. ఈ సమస్య తలకెక్కించుకోకుండా నటి మీరాజాస్మిన్ జాలీగా మళ్లీ నటనపై గమనం సారిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో విజ్ఞాని అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో విజ్ఞాని చిత్రంలో నటించడానికి అంగీకరించానన్నారు. ఈ చిత్రం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కాగా తన వివాహం చట్టబద్ధత వ్యవహారంలో సమస్య గురించి ప్రశ్నించగా దయచేసి ఆ విషయం గురించి మాత్రం అడక్కండి అంటూ దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. -
మీరా జాస్మిన్ పెళ్లి నమోదుకు చిక్కులు
నటి మీరా జాస్మిన్ వివాహం నమోదుకు రిజిస్టర్ అధికారులు నో అనడం చర్చనీయాంశంగా మారింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషలన్నింటిలోను ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన నటి మీరా జాస్మిన్. ఈమె వ్యక్తిగత జీవితం పలు మలుపులు తిరిగి చివరికి అనిల్ జాన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో ముడిపడింది. ప్రముఖ మాండలిన్ సంగీత కళాకారుడు రాజేష్‌తో మీరా జాస్మిన్ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. మీరాజాస్మిన్-అనిల్ జాన్‌ల వివాహం గత ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న చర్చిలో జరిగింది. అయితే వీరి వివాహాన్ని ప్రభుత్వ కార్పొరేషన్ అధికారులు నమోదు చేయలేదు. అందుకు కారణం అనిల్ జాన్కిది రెండో వివాహం అన్న సందేహమే. దీనిపై రిజిస్ట్రార్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ, ఇటీవల మీరాజాస్మిన్, అనిల్‌జాన్ తమ వివాహ నమోదు సమస్య గురించి అడగడానికి తమ కార్యాలయానికి వచ్చారని తెలిపారు. వివాహం జరిగిన 45 రోజుల తరువాత వివాహం నమోదు చేయడానికి వచ్చిన వారిని విచారించడం అన్నది సాధారణ విషయం అన్నారు. నటి మీరాజాస్మిన్ ప్రస్తుతం చిత్రాల్లో నటించడం లేదన్నారు. భర్తతో కలిసి దుబాయ్‌లో నివశిస్తున్న ఆమెను వివాహ నమోదు సమస్య గురించి ప్రశ్నించగా ఆమె ఎలాంటి బదులు ఇవ్వలేదని తెలిపారు. ఈ కారణంగానే వారి వివాహాన్ని చట్టబద్దంగా నమోదు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనిల్ జాన్ ఇంతకు ముందు బెంగళూర్‌కు చెందిన ఒక యువతితో పెళ్లికి సిద్ధం అయ్యారని అయితే కొన్ని కారణాల వల్ల ఆ వివాహం ఆగిపోయింది. ఆ యువతి కుటుంబ సభ్యులు తమ వివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందని పెళ్లి సమయంలో అనిల్ జాన్ పోలీసుల రక్షణ కోరారు. మరో విషయం ఏమిటంటే అనిల్ జాన్‌కు బెంగళూర్‌కు చెందిన యువతికి వివాహం అయినట్లు నటి మీరాజాస్మిన్, అనిల్ జాన్‌కు రెండో భార్య అనే విషయం ప్రచారంలో ఉంది. -
పెళ్లి కుదిరింది...
ఇది కథానాయికల పెళ్లి సీజన్‌లా ఉంది. మొన్నేమో వీణామాలిక్, నిన్నేమో సమీరారెడ్డి పెళ్లి వార్తలు తెలిశాయి. లేటెస్ట్గా ఈ జాబితాలో మీరా జాస్మిన్ చేరారు. ఆమెకు పెళ్లి కుదిరింది. కేరళకు చెందిన మీరా మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా పాపులార్టీ సంపాదించుకున్నారు. తెలుగులో ఆమె భద్ర, గుడుంబా శంకర్, మహారథి, అఆఇఈ తదితర చిత్రాల్లో నటించారు. ‘మాండలిన్’ రాజేష్‌తో మీరా ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు అప్పట్లో బాగా షికారు చేశాయి. అయితే... అలాంటిదేమీ లేదని మీరా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇటీవలే మీరాకు దుబాయ్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనిల్ జానీ టైటస్‌తో పెళ్లి ఖరారయ్యింది. ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఈ పెళ్లి కుదిరిందని సమాచారం. ఫిబ్రవరి 12న కేరళలోని పాలయమ్లో గల ఓ చర్చిలో వీరి పెళ్లి జరగనుంది. అనంతరం ఎడపళంజి ఆడిటోరియంలో రిసె ప్షన్ జరగనుంది. ప్రస్తుతం మీరా మలయాళంలో ‘ఒన్నుమ్ మిండాదే’ సినిమా చేస్తున్నారు.