AnilkumarYadav
-
నెల్లూరులో మంత్రుల బృందం పర్యటన
సాక్షి, నెల్లూరు: మంత్రుల బృందం నెల్లూరులో శనివారం పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కావలిలో రూ.86 లక్షలతో నిర్మించిన అగ్రి, ఆక్వా కల్చర్ ల్యాబ్.. తాళ్లపాలెంలో రూ.45 లక్షలతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే.. తుమ్మలపెంటలో రూ.64 కోట్లతో జలజీవన్ మిషన్‌ను మంత్రులు ప్రారంభించారు. జల జీవన్ మిషన్‌తో 240 గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. ఆముదాల దిన్నెలో రూ.15 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్‌ను కూడా ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా.. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. -
పాదయాత్రకు వస్తున్న స్పందనను ఓర్వలేకే విమర్శలు
నెల్లూరు(సెంట్రల్): విదేశాల్లో తనకు ఆస్తులున్నాయనే విషయాన్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, లేని పక్షంలో సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారాననే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీ నేతలు ఉందా అని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ప్రశ్నించారు. నగరంలోని 51వ డివిజన్లో గల ఏబీఎం కాంపౌండ్, సుబేదారుపేట ప్రాంతాల్లో ప్రజాదీవెన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా జగన్మోహన్రెడ్డికి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 15 రోజుల గడువిచ్చారని, ఆలోపు సవాల్‌ను స్వీకరించి నిరూపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రజల వద్దకు వెళ్లి నేరుగా పోటీ చేసి గెలవలేని వారు జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు బీద రవిచంద్ర వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. పాదయాత్రను చూస్తున్న టీడీపీ నేతలకు జ్వరం పట్టుకుందని, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కోసం ప్రత్యేక ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేస్తారని వ్యంగ్యంగా అన్నారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, నాయకులు బాలాప్రసాద్, అరవ ఆనంద్‌బాబు, కాయల సురేష్‌బాబు, సత్యానందం, ఆంథోనీ బాబు, సంతోషి రమేష్, చిట్టి, సరిత, ప్రమీల, వందవాసి రంగ, సంక్రాంతి కళ్యాణ్, దార్ల వెంకటేశ్వర్లు, పఠాన్ ఫయాజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరులో వైయస్ఆర్ కుటుంబం
-
'టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు'
నెల్లూరు: టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీదర్రెడ్డిలు అన్నారు. పట్టణంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల అవినీతిని బట్టబయలు చేసినందుకే తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించాలరని వారు ఆరోపించారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో స్టీఫెన్ తో సంభాషించిన ఆడియో టేపులు లభ్యమై, ప్రస్తుతం ఓటుకు కోట్లు కీలక దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.