జంతువధను ఆపండి: సుప్రీం
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న జంతువధను జులై 15 వరకు ఆపాల్సిందిగా సుప్రీం కోర్టు ఉత్వర్వులను జారీ చేసింది. బీహార్ లో నీల్ గాయ్( నీలి ఎద్దు)లను, ఉత్తరాఖండ్ లో అడవిపందులను, హిమాచల్ ప్రదేశ్ లో కోతులను చంపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎటువంటి అధ్యయనం చేయకుండానే ఈ నిర్ణయాన్ని తీసుకుందని జంతు సంరక్షణ బోర్డు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
పంటలను పాడు చేస్తున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కోరికపైనే తాము జంతువులను చంపడానికి అనుమతినిచ్చామని కేంద్ర ప్రభుత్వం బెబుతోంది.జంతువులను చంపడంపై జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు మండి పడుతున్నారు. మేనకా గాంధీ పర్యావరణ మంత్రిత్వశాఖ నిర్ణయాన్ని తప్పుపడుతూ గతంలో విమర్శించిన విషయం తెలిసిందే.