Animal Welfare Committee
-
Hyderabad: స్ట్రీట్ డాగ్స్‌కు.. ఫుడ్ పెట్టాలా?
సాక్షి, సిటీబ్యూరో: దయాగుణంతో వీధికుక్కలకు ఆహారం పెట్టేవారు తమ పేర్లను జీహెచ్ఎంసీ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకుగాను bit.ly/GHMCdogfreederform లింక్ ద్వారా లేదా సంబంధిత క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం ఉంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయవచ్చని పేర్కొంది.దాంతో ప్రజలు కుక్కల బారిన పడే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి కుక్కలకు ఆహారం వేసే విధానం, జంతు సంరక్షణ మార్గదర్శకాలు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపింది. స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగని కుక్కల గురించి సమాచారమిచ్చి ఆ కార్యక్రమాల డ్రైవ్స్‌లో భాగస్వాములు కావొచ్చని పేర్కొంది. కార్యక్రమాలకు జంతు సంక్షేమ సంఘాలు కూడా సహకరించాలని కోరింది. తద్వారా నగరాన్ని సురక్షిత, ఆరోగ్యకర నగరంగా మార్చవచ్చని పేర్కొంది. వివరాలకు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల్లో వెటర్నరీ అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించింది. -
పాముదీ ప్రాణమే...
మదర్ ఎర్త్ ఇంట్లోగాని, ఇంటి పరిసరాల్లోకి గాని పొరపాటున ఓ పామో, తేలో కనిపిస్తే అందరికీ వచ్చే మొదటి ఆలోచన దాన్ని ఎలా చంపాలి అని. అంతే కానీ దాన్ని కాపాడే అవకాశం ఏదైనా ఉందా అనే ఆలోచన ఏ మాత్రం రాదు. వాస్తవానికి మన ఇంటి పరిసరాల్లోకి వచ్చే ప్రతి పురుగును, ప్రతి పామునూ చంపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ‘భయం’ కొద్దీ మనం చంపేస్తుంటాం. కానీ, అలా చేయకుండా ఆ జీవుల్ని కాపాడి, వాటిని ఊరి చివర్లో, అడవుల్లోనో వదిలిపెట్టడమే నిజమైన మానవత్వం. అలా చేయడానికి గొప్ప ధైర్య సాహసాలు అవసరం లేదు. వాటిదీ మనలాంటి ప్రాణమే అని గుర్తిస్తే చాలు. ‘భారతీయ ప్రాణి మిత్ర సంఘ్’ అనే సేవా సంస్థ ఉంది. హైదరాబాద్‌తోపాటు జిల్లాలన్నింటిలోనూ యానిమల్ వెల్ఫేర్ కమిటీలు పని చేస్తున్నాయి. ఎవరింట్లోకైనా పాము వస్తే, దానికి హాని తలపెట్టకుండా వారికి సమాచారం చేరవేస్తే చాలు. వారి మనుషులు వచ్చి ఆ పామును పట్టుకొని తీసుకెళ్లి అడవుల్లో వదిలేస్తారు లేదా జూలకు ఇస్తారు. మూగ జీవుల ప్రాణాలను కాపాడేందుకు ఇలాంటి అద్భుతమైన సేవను ప్రారంభించిన ఆ సంస్థకు అభినందించాల్సిందే. ఎవరికి వారు తమకు సమీపంలోనే ఈ స్వచ్ఛంద కార్యకర్తల నంబర్లను దగ్గర ఉంచుకుంటే మంచిది.