Anjala
-
హీరోయిన్ అంజలా జవేరీ భర్త 'విలన్' అని మీకు తెలుసా?
తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న హీరోయిన్లలో అంజలా జవేరీ ఒకరు. వెంకటేష్ సరసన ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ప్రేమించుకుందాం రా. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో అంజలా జవేరీకి వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో రెండో సినిమాతోనే అంజలాకు మెగాస్టార్ చిరంజీవితో జతకట్టే అవకాశం దక్కింది. 1998లో చిరంజీవి-జవేరీ నటించిన చూడాలని ఉంది సినిమా బంపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. మంగళవారం అంజలా జవేరీ బర్త్‌డే సందర్భంగా ఆమెకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం. బాలకృష్ణతో సమరసింహా రెడ్డి, నాగార్జున రావోయి చందమామ వంటి సినిమాలు విజయవంతం కావడంతో తెలుగులో కాన్నాళ్ల పాటు అంజలా జవేరీ స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఆ సమయంలోనే మోడల్ తరుణ్ అరోరాతో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు డేటింగ్ అనంతరం ఈ జంట పెళ్లి పీటలెక్కింది. అయితే భవిష్యత్‌లోనూ పిల్లల్ని కనే ఉద్దేశం లేదని, తాము పిల్లలు వద్దునుకున్నాం అని తరుణ్ అరోరా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి ఉన్న కారణం చెబుతూ.. పెద్దలు కుదిర్చిన బంధంలో పెళ్లి తర్వాత భార్యాభర్తల ప్రేమకు గుర్తుగా పుట్టేందుకు పిల్లలు పుడతారని, అయితే తాము మాత్రం ముందు నుంచే ప్రేమలో ఉన్నామన్నారు. తన దృష్టిలో జవేరీ ఒక పాపాయి వంటిదని ఇక పిల్లలు లేరనే బాధ, కావాలనే కోరిక తమకు లేవని చెప్పుకొచ్చారు. తరుణ్ అరోరా కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. టాలీవుడ్లో ఆయనకు మోస్ట్ స్టైలిష్ విలన్ అనే పేరు ఉంది. ఖైదీ నెంబర్ 150 సినిమాలో విలన్ పాత్ర గుర్తుంది కదా..అందులో నటించింది ఈయనే. కాటమ రాయుడు , జయ జానకి నాయక అర్జున్ సురవరం వంటి సినిమాల్లోనూ విలన్ పాత్రలో నటించిన తరుణ్ అరోరా అంజలా జవేరీ భర్త అని చాలా మందికి తెలియదు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అంజలా జవేరీ.. 2012లో చివరగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించింది. అంజలా జవేరీ అరుదైన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి : ఆ కారణంతో సినిమాలు మానేద్దామనుకున్న సౌందర్య రచ్చకెక్కిన అజయ్- రవీనా లవ్‌స్టోరీ -
అంజలలో విమల్ నందిత
యువజంట విమల్ నందిత నాయికా నాయకులుగా నటిస్తున్న చిత్రం అంజల. స్టంట్ మాస్టర్, దిలీప్ తొలిసారిగా నిర్మాతగా మారి తన ఫార్మర్ మాస్టర్‌ప్లాన్ ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు తంగం శరవణన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఒక టీ కొట్టు చుట్టూ ఉండే జనాలు వారి జీవన విధానాలను ఆవిష్కరించే కథా చిత్రంగా అంజల ఉంటుందన్నారు. మదురై సమీపంలోని చోళవందాని గ్రామం నేపథ్యంగా చిత్ర కథ జరుగుతోందన్నారు. చెన్నై మేల్మరువత్తూరు మదురై, కుట్రాలం తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశుపతి, మురుగదాస్, ఇమాన్ అన్నాచ్చి, పంజు సుబ్బు, దర్శకుడు ఆర్ వి ఉదయకుమార్, ఎళిల్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి రవికన్నన్ ఛాయాగ్రహణం, గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.