తెలంగాణ చిత్రం
తెలంగాణ కుంచె అద్భుతాలకు తారామతి బారాదరి కాన్వాస్‌గా మారింది. తెలంగాణ గడ్డపై పుట్టిన చిత్రకారులు రంగుల లోకాన్ని సృష్టించారు. జీవం ఉట్టిపడే చిత్రరాజాలను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబాలను కళ్లముందుంచారు. నూనూగు మీసాల యువకుల నుంచి ఎనిమిదిపదుల పెద్దల వరకూ తమ ప్రతిభను చాటారు.
ఆర్ట్ ఎట్ తెలంగాణ పేరిట శనివారం జరిగిన తెలంగాణకు చెందిన 90 మంది చిత్రకారులు తరలివచ్చారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ చిత్రాల పండుగ జరగనుంది. ఈ నెల 30 వరకు మొదటి బ్యాచ్‌కు చెందిన 50 మంది కళాకారులు, అక్టోబర్ 1 నుంచి 6 వరకు మిగతా 40 మంది కళాకారులు చిత్రాలు వేయనున్నారు. తర్వాత ఈ చిత్రాలను నగరంలో జరగనున్న మెట్రోపోలీస్ సదస్సులో ప్రదర్శించనున్నారు. లక్ష్మణ్ ఏలే, లకా్ష్మగౌడ్, వైకుంఠం, అంజనీరెడ్డి, కవిత, ఎమ్మెస్ దాతార్ల తదితర చిత్రకళాకారులు ఇందులో పాల్గొన్నారు.
ఔత్సాహికులకు మంచి వేదిక
ఇటువంటి కార్యక్రమాలు ఔత్సాహిక చిత్ర కళాకారులకు మంచి వేదిక అన్నారు ఏలె లక్ష్మణ్. సీనియర్ ఆర్టిస్టులతో ముఖాముఖితో పాటు వారి సలహాలు తీసుకోవచ్చు. అంతే కాకుండా చిత్రం గీసే సమయంలో వారిని గమనించే అవకాశం లభిస్తుందంటున్నారాయన.
గోల్కొండ