చిల్డ్రన్స్ స్పెషలిస్ట్‌గా సేవలందిస్తా
మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌లో 16వ ర్యాంకర్ అనూష
పులివెందుల, న్యూస్‌లైన్ : చిల్డ్రన్స్ స్పెషలిస్ట్‌గా సేవలు అందించడమే తన లక్ష్యమని మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌లో రాష్ట్రస్థాయిలో 83వ ర్యాంకు.. రాయలసీమస్థాయిలో 16వ ర్యాంకు సాధించిన అంకిరెడ్డి అనూష పేర్కొన్నారు.
తాను ఎంబీబీఎస్‌ను కర్నూలు మెడికల్ కళాశాలలో పూర్తిచేసినట్లు వెల్లడించారు. తల్లి హేమాదేవి హిమకుంట్లలోని పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తుండగా.. తండ్రి రామకృష్ణారెడ్డి రవీంద్రనాథపాఠశాలలో పీఈటీగా పనిచేస్తూ ఇటీవలే మృతి చెందారు. పులివెందులలోని బ్రాహ్మణపల్లె రోడ్డులో ఉన్న పెద్ద కొండప్ప కాలనీ సమీపంలో నివాసముంటున్నారు. చెన్నైలోని స్పీడ్ కోచింగ్ సెంటర్లో పీజీకి కోచింగ్ తీసుకున్న అనూష... అంతకముందు ఇంటర్మీడియట్లో కూడా రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది.