పంచాయతీ ఆఫీసులో ప్రేమ వివాహం
నార్మెట్ట (వరంగల్) : గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రేమ వివాహం జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నార్మెట్ట మండలం అంక్షాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్(24), రమ్య(20)లు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో.. గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో గ్రామ పెద్దలు సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రేమ జంటకు బుధవారం వివాహం జరిపించారు.