Ankur Bhatia
-
ఇది అదృష్టమే..! - అంకుర్ భాటియా
ముంబై: రామ్‌చరణ్ తేజ హీరోగాగా వస్తున్న భారీ చిత్రం జంజీర్ ద్వారా బాలీవుడ్‌లోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని నూతన నటుడు అంకుర్ భాటియా అంటున్నాడు. జంజీర్లో మనోడికి పెద్దగా డైలాగులు లేకున్నా.. అమితాబ్ బచ్చన్ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రావడం అదృష్టమేనన్నాడు. అపూర్వ లాఖియా తీసిన ఈ సినిమాలో రామ్ అమితాబ్ పాత్రలో కనిపిస్తాడు. ప్రియాంకచోప్రా ఇతనికి జోడీగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్‌గా నటించిన ప్రకాశ్‌రాజ్‌కు అంకుర్ కుడిభజంగా ఉంటాడు. బాలీవుడ్‌లోకి ప్రవేశించడానికి జంజీర్ చక్కటి అవకాశమని అభిప్రాయపడ్డారు. ‘గత మూడేళ్లుగా నేను న్యూయార్క్‌లో ఉంటూ సినిమాలు చేశాను. అక్కడి భారతీయులకు హాలీవుడ్ సినిమాల్లో పెద్ద పాత్రలు రావడం చాలా కష్టం. అందరూ నన్ను భారతీయుడిలా ఉంటావని అనేవాళ్లు. అందుకే భారత్‌కు వచ్చి నా మూలాలకు దగ్గరున్న పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను. ముంబై వచ్చి అపూర్వ లాఖియాను కలిసిన కొన్ని నెలలకు జంజీర్లో చిన్న పాత్ర దక్కింది. ఇందులో నాకు పెద్దగా డైలాగులు లేకున్నా సంజయ్‌దత్‌తో కొన్ని కీలక సన్నివేశాల్లో నటించాను. మొదటి సినిమాలోనే పెద్ద నటులతో కలిసి పనిచే సే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని అంకుర్ వివరించారు. అయితే దత్తో కలిసి ఫైట్లు చేయాల్సి వచ్చినప్పుడు ఎంతో భయపడ్డానని చెప్పాడు. అదృష్టవశాత్తూ యాక్షన్ సన్నివేశాలను చివర్లో చిత్రీకరించడం వల్ల అప్పటికి ఆయనంటే భయం కొద్దిగా తగ్గిందని తెలిపాడు. అన్నట్టు.. అంకుర్ మంచి రచయిత కూడా. ఇతడు రాసిన చిన్నకథను తన కొడుకు హర్షవర్దన్ కపూర్‌తో సినిమా తీయాలని అనిల్‌కపూర్ నిర్ణయించాడు. కత్రినా సోదరి ఇసబెల్ ఇందులో హీరోయిన్. తీరిక లేకుండా ఉండడం వల్ల ఈ సినిమాలో నటించలేకపోతున్నానని అంకుర్ భాటియా వివరించాడు. జంజీర్ వచ్చే నెల ఆరున విడుదలవుతోంది. -
‘జంజీర్లో నటించినందుకు ఆనందంగా ఉంది’
న్యూఢిల్లీ: జంజీర్ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఉందని నూతన నటుడు అంకుర్ భాటియా తెలిపాడు. అమితాబ్ బచ్చన్ హీరోగా 1973 సంవత్సరంలో రూపొందిన సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రావడం అదృష్టమేనన్నాడు. ఈ సినిమాలో అంకుర్‌కు పెద్దగా డైలాగ్‌లు లేకపోయినా సినిమాలో నటించడం నిజంగానే అదృష్టమని పేర్కొన్నాడు. తాను బాలీవుడ్లో ప్రవేశించడానికి జంజీర్ చక్కటి వేదికవుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇందులో విలన్‌గా నటించిన ప్రకాశ్‌రాజ్‌కు అంకుర్ కుడిభజంగా ఉంటాడు. అపూర్వ లాఖియా తీసిన ఈ సినిమాలో రామ్ అమితాబ్ పాత్రలో కనిపిస్తాడు. ప్రియాంకచోప్రా ఇతనికి జోడీగా కనువిందు చేయనుంది. గత రెండు- మూడు ఏళ్ల నుంచి న్యూయార్క్‌లోనే ఉంటూ సినిమాలు చేస్తున్నానని తెలిపాడు. భారతీయులకు హాలీవుడ్లో పెద్ద పాత్రలు రావడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. త్వరలో భారత్‌కు వచ్చి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని భాటియా తెలిపాడు. గతంలో తాను ముంబైకు వచ్చి చాలాసార్లు అవకాశాలకోసం ప్రయత్నించానని, జంజీర్ దర్శకుడు అపూర్వ లాకియా ఈ సినిమాలో తనకు మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించాడని తెలిపాడు. ప్రముఖలతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు.