ఏఎన్ఎం అభ్యర్థులకు కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్: ఏఎన్ఎం కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మందికి అర్హత పత్రాలు అందజేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రోశన్న, సర్వజనాస్పత్రి ఆర్ఎంఓ లలిత, ప్రభుత్వ ఏఎన్ఎం ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపల్ సుజాత, ఏఓ రత్నకుమార్‌తో కూడిన కమిటీ సమక్షంలో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గోపాల్‌రెడ్డి, ఎస్ఓ అతావుల్లా, రాఘవేంద్ర, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.