వలసలు షురూ
: అన్నాడీఎంకేలోకి వలసలు మొదలయ్యూరుు. డీఎండీకే తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రమణ్యం సీఎం జయలలితతో భేటీ అయ్యారు. డీఎండీకే రెబల్స్ జాబితాలో ఆయన కూడా చేరారు. పార్టీ నుంచి వలసలు మొదలవడంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష హోదాకు గండి పడనున్నది.
ఆ పార్టీ మాజీ నేత బన్రూటి రామచంద్రన్ నేతృత్వంలో పలువురు నాయకులు గురువారం అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో అవతరించారు. అయితే, అన్నాడీఎంకేతో ఏర్పడిన వైరంతో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్నాడీఎంకే పంచన చేరారు. డీఎండీకే రెబల్స్‌గా పార్టీ అధినేత విజయకాంత్‌కు ఆ ఏడుగురు చుక్కలు చూపిస్తున్నారు. ఇక, పార్టీ ప్రిసీడియం చైర్మన్ బన్రూటి రామచంద్రన్ అనారోగ్య కారణాలతో వైదొలిగారు. ఎమ్మెల్యే పదవికి , పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
దీంతో డీఎండీకే సంఖ్యా బలం 29 నుంచి 21కు తగ్గింది. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బన్రూటి రామచంద్రన్ ప్రస్తుతం అన్నాడిఎంకే పక్షాన చేరారు. ఆయన చేరికతో డీఎండీకే లో పెద్ద ఎత్తున వలసలు బయలుదేరడం తథ్యమన్న ఊహించినట్టుగానే వలసలు ప్రారంభమయ్యూరుు.
వ లసలు: బన్రూటి రామచంద్రన్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు రామనాథన్, చిన్నస్వామి, అశోక్, తదితరులు పెద్ద ఎత్తు న తమ మద్దతుదారులతో గురువారం అన్నాడీఎం కే తీర్థం పుచ్చుకున్నారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో అధినేత్రి, సీఎం జయలలిత సమక్షంలో వీరంతా అన్నాడీఎంకేలో చేరారు. మరి కొం దరు అన్నాడీఎంకేలో చేరడానికి సిద్ధం అవుతోండటంతో డీఎండీకేలో గుబులు మొదలైంది.పార్టీ జిల్లా ల కార్యదర్శులు, ఇది వరకు బన్రూటితో సన్నిహితంగా ఉన్న నేతలందరూ అన్నాడీఎంకే బాట పట్టే పనిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ వర్గా లు బయటకు వెళుతుండటంతో వారిని అడ్డుకుని పార్టీని రక్షించుకునేందుకు విజయకాంత్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బృందాలు రంగంలోకి దిగాయి.
పదవీ గండం:విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు గండి పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీ తిరుత్తణి శాసన సభ్యుడు అరుణ్ సుబ్రమణ్యం సీఎం జయలలికు జై కొట్టారు. దీంతో డీఎండీ కే రెబల్స్ జాబితా ఎనిమిదికి చేరింది. సచివాల యంలో సీఎం జయలలితను నియోజకవర్గ అభివృ ద్ధి పేరుతో అరుణ్ సుబ్రమణ్యం కలిశారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని విన్నవించుకుంటూ, జయలలితకు ఆయన జై కొట్టారు. దీంతో విజయకాంత్ ఎమ్మెల్యే ల సంఖ్య 20కు పడిపోయింది.
ఈ దృష్ట్యా, ఆయ న ప్రధాన ప్రతి పక్ష నేత పదవికి ఎసరు పెట్టేందుకు అన్నాడీఎంకే సిద్ధమవుతోంది.డీఎండీకేకన్నా, డీఎం కేకు ముగ్గురు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతి పక్ష హోదా దక్కే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ నుంచి అధికార పూర్వక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అయితే, అదే జరిగిన పక్షంలో రాష్ట్ర ప్రధాన ప్రతి పక్ష నేతగా డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ కావడం తథ్యం.
పీఎంకే ఎమ్మెల్యే మంతనాలు: అసెంబ్లీలో పీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అనైకట్టు ఎమ్మెల్యే కళైయరసు ఉదయం సచివాలయంలో సీఎం జయలలితను కలుసుకున్నారు. తన నియోజకవర్గంలో కుంటుపడ్డ అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఆదుకోవాలని విన్నవించారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కళైయరసు సీఎం జయలలితను కలవడంతో ఆయన ఇక ఆ పార్టీలోకి చేరినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈదృష్ట్యా, శాసన సభలో పీఎంకేకు రెబల్ ఎమ్మెల్యేగా కళైయరసు నిలవబోతున్నారు. అంతకు ముందుగా రాయపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఎండీకే నాయకులతో పాటుగా నటి వెన్నిరాడై నిర్మల, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన అక్కడి పార్టీల నాయకులు అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.