Anna Lezhneva
-
Anna Lezhneva: అన్నా లెజినోవా... ఇదొక డిఫరెంట్ యాంగిల్.. అనాథలతో సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Anna Lezhneva Facts: అన్నా లెజెనెవా ఎవరు? పవన్‌కు ఎలా పరిచయమయ్యారు?
పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా పేరు కొంతకాలంగా మార్మోగిపోతోంది. పవన్ ఆమెకు విడాకులిచ్చాడని, అంతలోనే అదంతా పుకారని వెలువడటంతో అసలీ అన్నా లెజినోవా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె ఏం చేస్తుంది? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అన్నా లెజినోవా గురించి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. అన్నా లెజినోవా రష్యన్ పౌరురాలు. 2011 సంవత్సరంలో తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె పవన్ కల్యాణ్‌ను తొలిసారి కలిసింది. ఈ చిత్రంలో అన్నా లెజినోవా చిన్న పాత్రలో నటించింది. అప్పటి నుంచే వారి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం సహజీవనం కూడా చేశారు. ఆ బంధాన్ని వివాహబంధంగా మార్చాలనుకున్నారు. వెంటనే పవన్ తన 2వ భార్య రేణుదేశాయ్ కి విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్నాను పెళ్లాడాడు. వీరిది మతాంతర వివాహం. పవన్ కళ్యాణ్ హిందువు కాగా అన్నా లెజినోవా క్రిస్టియన్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది. అప్పటి నుంచి అన్నా లెజినోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయింది. కాటన్ వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందర్నీ ఆశ్చర్య పరిచింది. పెళ్లయిన కొత్తలో ఆమె తన భర్తతో కలిసి డిన్నర్‌కు వెళ్లేది కానీ ఎప్పుడూ కూడా పబ్లిక్‌గా ఏ ఈవెంట్‌కు వెళ్లిన సందర్భాలు లేవు. అన్నా లెజినోవా ఎక్కువగా బాహ్య ప్రపంచంతో ఇంటరాక్ట్ అవరు. సోషల్ మీడియాలో ఆమె ఎక్కడా ఫోటోలు అప్లోడ్ చేసిన దాఖలాలు లేవు. అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో అన్నా లెజినోవా సాంప్రదాయమైన భారతీయ వస్త్రధారణలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. చీరకట్టు, నుదుట బొట్టుతో శ్రీజ పెళ్లిలో చాలా చురుగ్గా పాల్గొని మెగా కుటుంబంలో అలవోకగా కలిసిపోయింది. విదేశీ అమ్మాయి అయినప్పటికీ అప్పట్లో పవన్‌కు హారతి పడుతూ, వీర తిలకం దిద్దుతూ, అతడి కారుకి దిష్టితీసి కొబ్బరికాయ కొడుతూ వావ్ అనిపించింది. ఆ తర్వాత కూడా భారతీయ సాంప్రదాయం ఉట్టి పడేలా ఆమె నిండు వస్త్రాలతోనే పబ్లిక్ ఈవెంట్స్‌లో మెరిసింది. అన్నా మెగా ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండే తీరుకు అందరూ ఫిదా అయ్యారట. అందుకే ఆమె అంటే మెగా కుటుంబంలో అందరికీ ఇష్టం. క్రిస్మస్ వేడుకలకు మాత్రమే ఆమె తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్-అన్నా లెజ్నెవాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు పేరు పోలెనా అంజనా, కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. తన అన్న చిరంజీవి గుర్తుగా తన కొడుకుకి శంకర్ అని పేరు పెట్టాడని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే చిరంజీవి అసలు పేరు.. శివ శంకర్ వరప్రసాద్. -
అసలేం జరిగింది? మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?
పవన్ కల్యాణ్.. రాజకీయాల్లోకి రాకముందే వివాదాలతో వార్తల్లోకొచ్చిన వ్యక్తి. పార్టీ పెట్టి పదేళ్లయినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా.. సభల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుని నీతులు చెబుతారు. కానీ సొంత కుటుంబం విషయంలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిందే. కొన్ని అధికారికం. మరికొన్ని అనధికారికం. పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. 1997లో నందినిని పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణూ దేశాయ్ ను పవన్ కల్యాణ్ ప్రేమించి 2009లో కలిసి జీవితం ప్రారంభించారు. వీరికి ఇద్దరు పిల్లలు. అకీరా నందన్, ఆద్య. అయితే 2012 నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత 2013లో పవన్ కల్యాణ్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పాప పేరు పొలెనా అంజనా పవనోవా, తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్. గత కొన్నేళ్లుగా పవన్, అన్నా లెజినోవాతోనే కలిసి ఉంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌తో మూడో భార్య అన్నా కూడా దూరంగా ఉంటున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన పిల్లలతో అన్నా లెజినోవా సింగపూర్‌లో ఉంటున్నట్టు జాతీయ మీడియా తెలిపింది. మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా! పవన్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారనే ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్యమైన వేడుకల్లో ఆమె కనిపించకపోవడం కూడా ఆ పుకార్లకు ఆజ్యం పోసింది. కొన్నాళ్ల క్రితం మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరగ్గా.. ఆ వేడుకకు పవన్ కల్యాణ్ ఒక్కడే హాజరయ్యాడు. మిగిలిన మెగా హీరోలంతా తమ కుటుంబంతో కలిసి వస్తే.. పవన్ సింగిల్‌గానే వెళ్లాడు.అలాగే రామ్ చరణ్- ఉపాసనలకు కూతురు పుడితే కూడా చూడడానికి అన్నా లెజినోవా వెళ్లలేదు. ఇటీవల జరిగిన ఊయల వేడకలో కూడా ఆమె కనిపించకోవడంతో విడాకుల ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. పవన్ రాజకీయాలకు అన్నా దూరం గతంలో పవన్ పర్యటనల్లో అన్నా కనిపించేది. పవన్ ఎక్కడైనా పర్యటన ప్రారంభించాలనుకున్నప్పుడు అన్నాతో పూజాకార్యక్రమాలు నిర్వహించేలా జాగ్రత్త పడేవారు. తాజాగా వారాహి యాత్ర ఆరంభంలో ఎక్కడా అన్నా కనిపించలేదు. ప్రస్తుతం అన్నా లెజినోవా పిల్లలతో కలిసి సింగపూర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. పవన్‌తో విబేధాలు రావడంతో ఇకపై అతనికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. తుది నిర్ణయం తర్వాత అన్నా లెజినోవా రష్యాకు మకాం మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే పవన్ కానీ, అన్న లెజినోవా కాని స్పందించే వరకు ఆగాల్సిందే.