పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా పేరు కొంతకాలంగా మార్మోగిపోతోంది. పవన్ ఆమెకు విడాకులిచ్చాడని, అంతలోనే అదంతా పుకారని వెలువడటంతో అసలీ అన్నా లెజినోవా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె ఏం చేస్తుంది? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అన్నా లెజినోవా గురించి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
అన్నా లెజినోవా రష్యన్ పౌరురాలు. 2011 సంవత్సరంలో తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె పవన్ కల్యాణ్‌ను తొలిసారి కలిసింది. ఈ చిత్రంలో అన్నా లెజినోవా చిన్న పాత్రలో నటించింది. అప్పటి నుంచే వారి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం సహజీవనం కూడా చేశారు. ఆ బంధాన్ని వివాహబంధంగా మార్చాలనుకున్నారు. వెంటనే పవన్ తన 2వ భార్య రేణుదేశాయ్ కి విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు.
2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్నాను పెళ్లాడాడు. వీరిది మతాంతర వివాహం. పవన్ కళ్యాణ్ హిందువు కాగా అన్నా లెజినోవా క్రిస్టియన్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది. అప్పటి నుంచి అన్నా లెజినోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయింది. కాటన్ వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందర్నీ ఆశ్చర్య పరిచింది.
పెళ్లయిన కొత్తలో ఆమె తన భర్తతో కలిసి డిన్నర్‌కు వెళ్లేది కానీ ఎప్పుడూ కూడా పబ్లిక్‌గా ఏ ఈవెంట్‌కు వెళ్లిన సందర్భాలు లేవు. అన్నా లెజినోవా ఎక్కువగా బాహ్య ప్రపంచంతో ఇంటరాక్ట్ అవరు. సోషల్ మీడియాలో ఆమె ఎక్కడా ఫోటోలు అప్‌లోడ్ చేసిన దాఖలాలు లేవు. అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో అన్నా లెజినోవా సాంప్రదాయమైన భారతీయ వస్త్రధారణలో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.
చీరకట్టు, నుదుట బొట్టుతో శ్రీజ పెళ్లిలో చాలా చురుగ్గా పాల్గొని మెగా కుటుంబంలో అలవోకగా కలిసిపోయింది. విదేశీ అమ్మాయి అయినప్పటికీ అప్పట్లో పవన్‌కు హారతి పడుతూ, వీర తిలకం దిద్దుతూ, అతడి కారుకి దిష్టితీసి కొబ్బరికాయ కొడుతూ వావ్ అనిపించింది. ఆ తర్వాత కూడా భారతీయ సాంప్రదాయం ఉట్టి పడేలా ఆమె నిండు వస్త్రాలతోనే పబ్లిక్ ఈవెంట్స్‌లో మెరిసింది.
అన్నా మెగా ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండే తీరుకు అందరూ ఫిదా అయ్యారట. అందుకే ఆమె అంటే మెగా కుటుంబంలో అందరికీ ఇష్టం. క్రిస్‌మస్ వేడుకలకు మాత్రమే ఆమె తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్-అన్నా లెజ్నెవాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు పేరు పోలెనా అంజనా, కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. తన అన్న చిరంజీవి గుర్తుగా తన కొడుకుకి శంకర్ అని పేరు పెట్టాడని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే చిరంజీవి అసలు పేరు.. శివ శంకర్ వరప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment