జాబిల్లి కోసం ఆకాశమల్లె
శ్రీహరి ప్రధాన పాత్రలో రాజ్ నరేంద్ర దర్శకత్వంలో గుగ్గిళ్ల శివప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’. అనూప్ తేజ, స్మితికా ఆచార్య, సిమ్మిదాస్ హీరో, హీరోయిన్లు. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘కాసర్ల శ్యామ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు విశేష స్పందన లభిస్తోంది. చందమామలాంటి అమ్మాయి కోసం ఓ ప్రేమికుడు ఏం చేశాడన్నదే ఈ చిత్రకథ. శ్రీహరి చేసిన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, సమర్పణ: శశిప్రీతమ్.