భయపెడుతుంది..!
‘‘హారర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందర్నీ భయపెడుతుంది’’ అని దర్శకుడు సతీశ్‌కుమార్ చెప్పారు. సన్ని, ఆకాంక్ష, అరుణ్, కవిత ముఖ్యతారలుగా కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించిన ‘అంతా అక్కడే జరిగింది’ ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ పాటల సీడీని ఆవిష్కరించగా, కథానాయికలు ఇషికా సింగ్, శ్రీవాణీరెడ్డి, అవని థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఓ మంచి సినిమా తీయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని నిర్మాత పేర్కొన్నారు. హాలీవుడ్ మూవీ ‘ఫారానార్మల్ యాక్టివిటీ’ ప్రేరణతో ఈ సినిమా తీసినట్టుగా ఉందని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఇందులో అన్ని పాటలూ బాగా వచ్చాయని సంగీత దర్శకుడు రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయివెంకట్, ప్రసన్నకుమార్ తదితరులు మాట్లాడారు.