చైనా క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతం
బీజింగ్: చైనా గగనతలానికి క్షిపణి రక్షణ కవచం ఏర్పాటులో భాగంగా ఆ దేశం బుధవారం మూడోసారి క్షిపణి నిరోధక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. క్షిపణి నిరోధక సాంకేతికత పరీక్షలో భాగంగా చైనా మిలటరీ భూతలం నుంచి ఈ క్షిపణి పరీక్షను నిర్వహించిందని, ఈ పరీక్ష అన్ని రకాలుగా విజయవంతం అయిందని చైనా రక్షణ శాఖ వెల్లడించింది.
అయితే మిలటరీ పెద్ద ఎత్తున చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష నేపథ్యంలో బుధవారం 12 విమానాశ్రయాల్లో 290 విమానాల రాకపోకలు ప్రభావితమైనట్లు ‘జిన్హువా’ వార్తాసంస్థ పేర్కొంది. అలాగే సైన్యం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో షాంఘై, నాంజింగ్, తదితర పట్టణాల్లోని విమానాశ్రయాల్లో రాకపోకలపై గత ఆదివారం నుంచి ఆగస్టు 15 వరకూ ఆంక్షలు కూడా విధించినట్లు తెలిపింది.