Anti-Telangana
-
గ్రిడ్ కూల్చేందుకు విశ్వయత్నం
-
అనంతలో ఉధృతంగా సమైక్య ఉద్యమం
అనంతపురం జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేటి నుంచి ఈ నెల 12 వరకు ప్రైవేట్ పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించినట్లు ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు గురువారం ఇక్కడ వెల్లడించాయి. అలాగే విద్యుత్ సంస్థకు చెందిన ఉద్యోగులు నేడు, రేపు మూకుమ్మడి సెలవులు పెట్టారు. జాక్టో,ఏపీఎన్జీవో, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అనంతపురం నగరంలోని ఎస్కేయూ, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో విద్యార్థుల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో సమైక్యవాదులు నేడు లక్ష జన గళ ఘోషను నిర్వహిస్తున్నారు. -
భక్తులు లేక వెలవెలబోతున్న అలిపిరి తోల్గేట్
-
YSR జిల్లాలో 8వ రోజు కొనసాగుతున్న బంద్
-
వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు
కడప : విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లావ్యాప్తంగా ఎనిమిదో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు సమైక్యాంధ్ర జేఏసీ వారం రోజుల పాటు ప్రయివేట్ విద్యా సంస్థల బంద్కు పిలుపు నిచ్చింది. పులివెందులలోనూ బుధవారం ఉదయం బంద్ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రొద్దుటూరులో బంద్ కొనసాగుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఎన్జీవోలు 12వ తేదీ నుంచి విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలోనో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య ఉద్యమం