YSR జిల్లాలో 8వ రోజు కొనసాగుతున్న బంద్ | 8th day: Protest Against Bifurcation Continues in YSR District | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 7 2013 10:18 AM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM

విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లావ్యాప్తంగా ఎనిమిదో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు సమైక్యాంధ్ర జేఏసీ వారం రోజుల పాటు ప్రయివేట్ విద్యా సంస్థల బంద్కు పిలుపు నిచ్చింది. పులివెందులలోనూ బుధవారం ఉదయం బంద్ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రొద్దుటూరులో బంద్‌ కొనసాగుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఎన్జీవోలు 12వ తేదీ నుంచి విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలోనో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement