దేవాస్ అబద్ధం చెప్పింది: సీబీఐ
న్యూఢిల్లీ: దేవాస్ మల్టీమీడియా సంస్థ స్థాపితమైన నెల రోజుల్లోనే.. తమ వద్ద మల్టీమీడియా సమాచారాన్ని సరఫరా చేసేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, దానిపై మేధో సంపత్తి హక్కులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి.. ఇస్రో వాణిజ్య సంస్థ యాంత్రిక్స్తో ఒప్పందం చేసుకుందని సీబీఐ ఆరోపించింది.
దానివల్ల దేవాస్ షేర్ ధరలు ఏకంగా 1.25 లక్షల రెట్లు పెరిగిపోయిందని పటియాలా హౌస్ కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లో తెలిపింది. అంతేగాకుండా దేవాస్ రూ. 579 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ రాబట్టుకోగలిగిందని చెప్పింది.