Anup Rao
-
ఆపరేషన్ ‘ఎడ్యుకేషన్’
సాక్షి, సిటీబ్యూరో/దోమలగూడ: అక్టోబర్ 5న దాన్ ఉత్సవ్‌లో భాగంగా యూనిక్వీ బ్లాక్ టై చారిటీ డిన్నర్ ‘ఫుడ్ ఫర్ చేంజ్’ను జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ రౌండ్ టేబుల్ (హెచ్ఆర్టీ)-8 సభ్యుడు అనూప్ రావు తెలిపారు. మంగళవారం మారియట్ హోటల్లో ఈవెంట్ వివరాలను ఆయన తెలిపారు. ఈవెంట్‌కు అంబాసిడర్లుగా ఉన్న బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ గోపీచంద్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, సినీ నటి సమం త కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఇచ్చే నగదును సర్కారీ పాఠశాల విద్యార్థుల ఉన్నతికి వెచ్చిస్తామన్నారు. సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ప్రముఖుల సహకారంతో సర్కారీ బ డుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యను కార్పొరేట్ పాఠశాలల దీటుగా ఉండేలా కృషి చేసేందుకు ఆవిర్భవించిన ‘ప్రాజెక్ట్ 511’కు ఈ నిధులు అందచేస్తామన్నారు. -
రిలయన్స్ లైఫ్ నుంచి ఆన్లైన్ టర్మ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ బీమా కంపెనీ రిలయన్స్ లైఫ్ అందుబాటు ధరల్లో ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. పూర్తి పారదర్శకంగా, సులభంగా తీసుకునే విధంగా ఈ ఆన్లైన్ టర్మ్ పాలసీని రూపొందించినట్లు రిలయన్స్ లైఫ్ సీఈవో అనూప్ రావు తెలిపారు. 25 ఏళ్ల ఉన్న వ్యక్తి కోటి రూపాయలకు బీమా తీసుకుంటే రోజుకు కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందన్నారు. కనీస బీమా మొత్తం రూ.25 లక్షలు, కనీస వార్షిక ప్రీమియం రూ.3,500లుగా నిర్ణయించారు. ధూమపానం అలవాటు లేనివారికి, మహిళలకు ప్రీమియంలో తగ్గింపును రిలయన్స్ లైఫ్ అందిస్తోంది.