బీఎస్ఎన్ఎల్ సీఎండీగా మరో నాలుగేళ్లు శ్రీవాత్సవనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సీఎండీగా అనుపమ శ్రీవాత్సవ మరో నాలుగేళ్లు కొనసాగుతారు. ఐదేళ్ల కాలానికి లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ బీఎస్ఎన్ఎల్ సీఎండీగా శ్రీవాత్సవను ప్రభుత్వం గత ఏడాది నియమించింది. ఏడాది కాలం తర్వాత ఆయన పనితీరును మదింపు చేసిన తర్వాత ఈ నియామకాన్ని కొనసాగిస్తామనే షరతుపై ప్రభుత్వం ఆయనను నియమించింది. బీఎస్ఎన్ఎల్ సీఎండీగా ఏడాది కాలం పాటు ఆయన పనితీరును మదింపు చేసిన ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో నాలుగేళ్లు పొడిగించింది. తన మీద నమ్మకం ఉంచినందుకు అనుపమ శ్రీవాత్సవ ప్రభుత్వానికి కృతజ్జతలు తెలిపారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్కు కీలకమని, ఇది టర్న్ అరౌండ్ సమయమని శ్రీవాత్సవ పేర్కొన్నారు.