ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
విశాఖపట్నం: లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెందుర్తిలోని ర్యాట్టిక్ షాపు నిర్వాహకుల నుంచి స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పలస్వామి దొర రూ. 18 వేలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో షాపు నిర్వహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం అప్పలస్వామి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.