గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
కర్నూలు: గుండెపోటుతో వ్యక్తి మరణించిన సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం అప్పలాపురం గ్రామంలో మంగళవారం తెళ్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచ్ పి.ప్రసాద్ రెడ్డి(42) సోమవారం అర్ధరాత్రి గుండెనొప్పితో బాధపడుతూ బనగానపల్లి ఆస్పత్రిలో చేరారు.
చికిత్స పొందుతూ ప్రసాద్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ప్రసాద్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.