'పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తాం'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రారంభమైంది. సమావేశానికి ముందు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధించడానికి కేంద్రంపై పోరాటం చేస్తామని రఘవీరా రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం పలువురు ఎంపీలు, మాజీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపడతామన్నారు.
సమావేశానికి కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్, పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి, ఎంపీ జేడీ శీలం, కేవీపీ, సి. రామచంద్రయ్య, కొప్పుల రాజు హాజరయ్యారు. కాగా సమావేశానికి బొత్స సత్యనారాయణ, చిరంజీవి గైర్హాజరయ్యారు.