Appointments Committee of Cabinet
-
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ తదుపరి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న గోవింద్ మోహన్‌ను అజయ్‌కుమార్ భల్లా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈనెల 22న అజయ్‌కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు గోవింద్ మోహన్ బాధ్యతలు చేపడతారు. నళిన్ ప్రభాత్ పదవీకాలం కుదింపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా నళిన్ ప్రభాత్ పదవీకాలం 2028 ఆగస్టు 31 ఉండగా కేంద్రం అర్ధంతరంగా కుదించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ను డిప్యుటేషన్‌పై ఏజీఎంయూటీ కేడర్‌కు మార్చింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా లేదా మూడేళ్లపాటు నళిన్ ఏజీఎంయూటీ కేడర్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగుతారని వివరించింది. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– కేంద్ర పాలిత ప్రాంతాలను కలిసి ఏజీఎంయూటీ కేడర్‌గా పిలుస్తారు. ఇది కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది. ప్రభాత్‌కు కేంద్రం కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. -
ఎన్ఎస్జీ చీఫ్‌గా నళిన్ ప్రభాత్
న్యూఢిల్లీ: దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేబినెట్లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన ప్రభాత్ సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 2028 ఆగస్ట్ 31వ తేదీ వరకు ఎన్ఎస్జీ చీఫ్‌గా ఆయన కొనసాగుతారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్ నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేబోర్డు నూతన ఛైర్మన్, సీఈఓగా సునీత్ శర్మను నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో పునర్నిర్మించిన బోర్డు తొలిసీఈవోగా సునీత్ వర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పదవీ కాలం నేటితో (2020 డిసెంబరు 31) ముగియనుంది. దీంతో తాజా నియామకం జరిగింది. ఇప్పటికే వినోద్ కుమార్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా 1978 బ్యాచ్‌కు చెందిన సునీత్ శర్మ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఆఫీసర్. ఇంతకుముందు రాయబరేలి, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గాను, పూణే, సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్‌గా విధులు నిర్వహించారు. -
డీఆర్డీఓ చీఫ్ తొలగింపు
న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) చీఫ్ అవినాశ్చందర్ను తప్పుకోవాలని కేబినెట్ నియామకాల కమిటీ మంగళవారం ఆదేశించింది. ఈ నెల 31 నాటికి ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. చందర్ డీఆర్డీఓ కార్యదర్శిగా గతేడాది నవంబర్ 30న రిటైర్ అయినప్పటికీ, ఆయన పదవీ కాలాన్ని 18 నెలలు పొడిగించింది. కానీ ఈ పొడిగింపును ప్రభుత్వం 45 రోజుల్లోనే తొలగించడం గమనార్హం.