April 4th
-
4న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ సెంట్రల్ ఆఫీసు ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిల్లో సంస్థాగతంగా మరింత బలోపేతం చేయటంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, మంచినీటి సమస్య, ప్రాజెక్టుల రీడిజైన్, రైతుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు హాజరు కావాలని శివకుమార్ కోరారు. -
రేపు శ్రీశైలం ఆలయం మూసివేత
శ్రీశైలం : చంద్రగ్రహణం సందర్భంగా శనివారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయం మూసివేయనున్నారు. శనివారం వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహా మంగళహారతులు నిర్వహించిన అనంతరం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని, రాత్రి 8 గంటల తర్వాత ఆలయ ద్వారాలు తెరిచి దేవాలయశుద్ధి, సంప్రోక్షణ చేసి స్వామి అమ్మవార్లకు పూజలు, మహానివేదన తదితర కార్యక్రమాలు చేపడతామని అధికారులు వెల్లడించారు. తిరిగి ఆదివారం ఉదయం దర్శన, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. -
వీవీఎస్ అకాడమీ సిద్ధం
వచ్చే నెలలో ప్రారంభించనున్న లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: చాలా మంది మాజీ క్రికెటర్ల బాటలోనే హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇప్పుడు కోచింగ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. 134 టెస్టుల్లో 8,781 పరుగులు చేసిన ఈ దిగ్గజ ఆటగాడు త్వరలోనే నగరంలో సొంత క్రికెట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నాడు. ‘వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీ’ పేరుతో సిద్ధమవుతున్న ఈ అకాడమీ ఏప్రిల్ 4న ప్రారంభం కానుంది. బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ ఈ వివరాలు వెల్లడించారు. నగర శివార్లలోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో ఇది ఏర్పాటవుతోంది. ప్రాథమికంగా రెండు నెలల పాటు ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరం నిర్వహించి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కోచింగ్‌ను కొనసాగిస్తారు. భిన్న రకాల వికెట్లతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని, తనకు ఇంతటి స్థాయి కల్పించిన ఆటకు ఇది సేవ చేయడమేనని అన్నాడు. ‘2012లో నేను రిటైర్ అయిననాటినుంచి చాలా మంది అకాడమీ ఎప్పుడు పెడుతున్నారని అడిగేవారు. నాకున్న గుర్తింపు ప్రకారం, వారి అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా అత్యుత్తమ శిక్షణ అందించడం నా బాధ్యత. ఇది నా కలల ప్రాజెక్ట్. సీనియర్ కోచ్‌లు ఇక్కడ శిక్షణ ఇవ్వనుండగా...నాకున్న స్నేహాలతో పలు విదేశీ క్రికెటర్ల ద్వారా కూడా ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను. సాధ్యమైనంత ఎక్కువ సమయం నేను కూడా శిక్షణ అందించేందుకు వెచ్చిస్తాను. వచ్చే కొన్నేళ్లలో గొప్ప ఆటగాళ్లు నా అకాడమీలో తయారు కావాలని, ఆటగాడిగానే కాకుండా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన వ్యక్తిగా కూడా నన్ను గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు.