ఏప్రిల్ 9న ఉప ఎన్నికలు
హిందూపురం అర్బన్ : మున్సిపాల్టీలోని 9వ వార్డు ఉపఎన్నికలు ఏప్రిల్ 9న జరుగనున్నట్టు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిదోవార్డు కౌన్సిలర్ ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడిన ఈ వార్డుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 20 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణ, అదేరోజు మ««ధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థుల జాబితా విడుదల ఉంటుంది. ఏప్రిల్ 9న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు.
ఎన్నికల కోడ్ అమలు
ఎన్నికల కోడ్ గురువారం నుంచే అమలులోకి వచ్చిందని కమిషనర్ చెప్పారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. 9వ వార్డులో మొత్తం ఓటర్లు 2,565 ఉండగా ఇందులో పురుçషులు 1303, 1262 మంది స్త్రీలు ఉన్నారు. కాగా ఎన్నికల అధికారిగా కమిషనర్, సహాయ ఎన్నికల నిర్వాహణాధికారులుగా ఈఈ రమేష్, టీపీఓ తులసీరాం వ్యవహరిస్తారన్నారు. అలాగే ఎన్నికల కోడ్ అమలు నిర్వహణాధికారిగా సోమశేఖర్, ఎన్నికల వ్యయగణాంకాధికారిగా డీఈ ప్రసాద్ వ్యవహరిస్తారని చెప్పారు.