అమెరికా అధ్యక్షుడిగా సెహ్వాగ్!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు న్యూయర్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని శనివారం ఉదయం ట్విట్టర్ ద్వారా అభిమానులకు పంచిన సెహ్వాగ్ హ్యాపీ 'ఏప్రిల్ ఫూల్స్ డే' అని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు స్టీఫెన్ స్మిత్ ఈ కథనాన్ని రాసినట్లు సెహ్వాగ్ షేర్ చేసిన ఆర్టికల్ కటింగ్ క్లిప్‌లో ఉంది. కాగా, కొద్దిరోజుల క్రితం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పోలుస్తూ ఆస్ట్రేలియా మీడియా కథనాలు రాసిన విషయం తెలిసిందే.
సెహ్వాగ్ షేర్ చేసిన కథనంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి ఇన్ డైరెక్టుగా వ్యంగ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి. తరచూ అమెరికా వస్తున్న వీరూతో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోందని ఆర్టికల్‌లో ఉంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్‌ను అమెరికా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని ఆర్టికల్‌లో స్టీఫెన్ పేర్కొన్నారు.
ఈ ఏడాది అమెరికా పర్యటనకు మోదీ వెళ్లిన సమయంలో ఇరువురూ మోదీతో ఈ మేరకు చర్చిస్తారని ఉంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్ హ్యూమరస్ ట్వీట్లతో అలరిస్తున్న విషయం తెలిసిందే.
Hahaha ! pic.twitter.com/xyvzQV1Ug8
— Virender Sehwag (@virendersehwag) April 1, 2017