చిన్న రాష్ట్రాలతోనే సమగ్రాభివృద్ధి
హన్మకొండ సిటి, న్యూస్‌లైన్ : చిన్న రాష్ట్రాల ద్వారానే సమగ్రాభివృద్ధి సాధ్యమని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బంజార బంధుమిత్ర సంక్షేమ సంఘం రూపొందించిన నూతన సంవత్స ర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడారు.
తెలంగాణ వచ్చి తీరుతుంది.. 17 శాతం ఉన్న గిరిజన జనభా ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి చెందడంతోపాటు చైతన్య వంతులవుతున్నార ని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఇతర కులాలను చేర్చవచ్చు.. కానీ తొలగించడం కుదరదని చెప్పా రు. ఓబీసీలో చేర్చడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం సరిపోతుందని, ఎస్సీ, ఎస్టీ జాబితాలో కలపడానికి పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంటుందన్నా రు. ఓబీసీలో ఇటీవల లక్కమారి కాపుతో సహా 107 కులాలను చేర్చామని వివరించారు.
1977లో ఇంది రాగాంధీ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, అప్పటి నుంచి రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకుం టూ అభివృద్ధి సాధిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. బంజారాలు ఒక శక్తిగా ఉండాలని సూచించారు. మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి మాట్లాడుతూ గిరిజనులు ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటి పరిష్కారానికి మంత్రి కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి ఆజ్మీర చందులాల్ మాట్లాడుతూ బంజారాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
కేయూ ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో లంబాడా ల్లో 35 తెగలుండగా, జిల్లాలో ఏడు తెగలున్నాయని వివరించారు. ఆరు లక్షల 40వేల మంది జనాభా ఉందని, వీరికి వారి గోత్రాల గురించి సంపూర్ణ అవగాహన లేదన్నారు. ఈ క్రమంలో 2014 క్యాలెండర్‌ను, బంజార జాతికి సంబంధించిన సంపూర్ణ వివరాలు, సంస్కృతి, సాంప్రదాయాలు వివరిస్తూ తయారు చేశామని చెప్పారు.
కార్యక్రమంలో బంజార బంధుమిత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోరిక వీరన్న, కార్యదర్శి బానోత్ కిషన్‌నాయక్, ప్రొఫెసర్ వీరన్ననాయక్, ప్రొఫెసర్ సురేష్‌లాల్, ప్రజా సంఘాల నాయకులు జి.సజ్జన్ నాయక్, జవహర్లాల్, రూపులాల్, దేవీలాల్, వీరన్న నాయక్, పి.రవీందర్‌నాయక్, పోరిక ఉదయ్ సింగ్ నాయక్ పాల్గొన్నారు.