breaking news
Arattai
-
అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'అరట్టై' (Arattai)కు ఆదరణ పెరుగుతోంది. లక్షలమంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే కొందరికి అరట్టై అంటే ఏమిటో బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో దీని గురించి తెలుసుకుందాం.అరట్టై అనేది తమిళ పదం. దీనిని ఏ భాషలో ఎలా పిలవాలి అనే విషయాన్ని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్వీట్ చేసారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో అరట్టైకు తెలుగులో 'మాటలాట' (మాట్లాడుకోవడం) అని సూచించారు.జోహో మెసేజింగ్ యాప్.. అరట్టై మెటా యాజమాన్యంలోని వాట్సాప్'కు ప్రత్యర్థిగా వచ్చింది. ఇందులో వాట్సాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు.How to say "Arattai" in various languages. pic.twitter.com/ynqBe4euBo— Sridhar Vembu (@svembu) October 11, 2025అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు●అరట్టై ఆండ్రాయిడ్ టీవీలకు, ఆ స్థాయి పరికరాలకు యాక్సెస్ అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.●అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యూ' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.●అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: ఏఐ ట్రాఫిక్ సిస్టం: ఎవ్వరూ తప్పించుకోలేరు! -
‘ఐయామ్ సారీ.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటా..’
జోహో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా కొన్ని రోజులు దూరంగా ఉంటానని ప్రకటించారు. కంపెనీ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కొన్ని కోడ్లను మరింత సమర్థవంతంగా సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇటీవల కాలంలో ఎక్స్ వంటి సామాజిక మధ్యమాల్లో చాలా చురుకుగా ఉన్న వెంబు తాను రన్ చేయాలనుకునే కొన్ని కోడ్లను మెరుగుపరిచేందుకు కొంతకాలం ఆన్లైన్ ఎంగేజ్మెంట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పనిలో నాణ్యత ముఖ్యమని చెప్పడం కంటే మనమే ఆ పనిని సమర్థంగా చేసి చూపించాలన్నారు. తన సోషల్ మీడియా అనుచరులకు ఇలా కఠినమైన పరిమితిని విధించవలసి వచ్చినందుకు చింతిస్తున్నానని చెప్పారు.ఇటీవల కాలంలో కంపెనీ తయారు చేసిన దేశీయ ఆన్లైన్ కమ్యునికేషన్ ప్లాట్‌ఫామ్ అరట్టై యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆ యాప్‌ను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్‌కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా తాను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నానంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలుఅరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా..
జోహో మెసేజింగ్ యాప్.. అరట్టై (Arattai) గత కొన్ని రోజులుగా అధిక ప్రజాదరణ పొందుతోంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు సమాచార గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.మెసేజస్ పంపుకోవడానికి, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటివి షేర్ చేసుకోవడానికి.. వాయిస్ కాల్స్ & వీడియో కాల్స్ చేసుకోవడానికి అరట్టై ఉపయోగపడుతుంది. ''అరట్టై చాట్ యాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు భార్యాభర్తలు షేర్ చేసుకునే ఫోటోలు ఎంతవరకు గోప్యంగా ఉంటాయని'' ఒక యూజర్ అడిగారు. దీనిని 'నన్ను నమ్మండి బ్రో' అంటూ జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు (Sridhar Vembu) పేర్కొన్నారు.యూజర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకునే యాప్ రూపొందించామని, వినియోగదారుల భద్రతకు ఎలాంటి భంగం కలగదని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్' కూడా రాబోతోందని ఆయన అన్నారు. నమ్మకం చాలా విలువైనది.. మేము ప్రపంచ మార్కెట్లో ప్రతిరోజూ ఆ నమ్మకాన్ని సంపాదిస్తున్నాము. మా వినియోగదారుల నమ్మకాన్ని మేము నెరవేరుస్తూనే ఉంటామని వెంబు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: గ్రోక్ ఏఐ వీడియో: స్పందించిన మస్క్ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వాట్సాప్ ప్రారంభమైన తరువాత ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ 2016 వరకు అందుబాటులో లేదు. అరట్టై కొత్తది కాబట్టి.. ఇందులో కూడా అలాంటి ఫీచర్ తప్పకుండా వస్తుందని ఒక యూజర్ పేర్కొన్నారు. ఎవరైనా ఒక మంచి చేస్తుంటే బెదిరించడానికి ప్రయత్నించవద్దని.. ఇంకొకరు అన్నారు. ఏదైనా లోపాలను గుర్తించి మెరుగుపరచడంలో సహాయపడటం మంచిది. ఉద్దేశాలు మంచిగా ఉండాలి, సామాజిక వ్యాఖ్యాతల ఆధారంగా పక్షపాతంతో ఉండకూడదని మరొకరు పేర్కొన్నారు.I asked the Zoho founder how private the pictures shared between a husband and wife are when using the Arattai chat app. His response: "Trust me, bro!" pic.twitter.com/7MeRQrmVik— Ravi (@tamilravi) October 8, 2025 -
అరట్టై అదుర్స్.. ఆ రెండింటిలో లేని ఫీచర్ ఇదే..
డిజిటల్ కమ్యూనికేషన్ యుగంలో గోప్యత, ఫైల్ షేరింగ్, ఆటోమేషన్ సామర్థ్యాలు వినియోగదారులు తమ ఇష్టపడే మెసేజింగ్ యాప్‌లను ఎంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకునే కారకాలుగా మారాయి. ఇంక్42 (Inc42) రీసెర్చ్ కొత్త తులనాత్మక విశ్లేషణ మూడు ప్రసిద్ధ ప్లాట్ ఫామ్‌లు - స్వదేశీ అరట్టై, వాట్సాప్,టెలిగ్రామ్‌లలో ఏవీ దేనికి ప్రత్యేకమో.. వీటిలో మన అరట్టై ఏ ఫీచర్లో గొప్పదో తెలియజేస్తోంది.అరట్టైజోహో సంస్థ అరట్టై యాప్‌ను అభివృద్ధి చేసింది. భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ యాప్ ప్రైవసీ-ఫస్ట్ ప్రత్యామ్నాయంగా ఉంది. ఇందులో యూజర్ల డేటాను ఇతరులకు విక్రయించడం ఉండదు. యాప్‌లోని అంతర్నిర్మిత విజిల్ బ్లోయర్ ఫీచర్ నిఘా, డేటా మానిటైజేషన్ గురించి ఆందోళన చెందే వినియోగదారులకు నిశ్చింత కలిగిస్తుంది. ఎన్క్రిప్షన్ వాయిస్ కాల్స్‌కే పరిమితం అయినప్పటికీ, దీని పారదర్శకత, స్థానిక మూలాలు గోప్యత-స్పృహ ఉన్న భారతీయ వినియోగదారులకు కచ్చితమైన ఎంపికగా చేస్తాయి.వాట్సాప్వాట్సాప్ భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా ఉంది. మెరుగైన ఇంటర్ ఫేస్, వ్యాపార సాధనాలతో కూడిన డీప్ ఇంటిగ్రేషన్‌తో ఆదరణ పొందింది. అయితే మాతృ సంస్థ మెటాతో దాని డేటా-షేరింగ్ పద్ధతులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.టెలిగ్రామ్టెలిగ్రామ్ దాని భారీ గ్రూప్‌లు / ఛానెల్ సామర్థ్యాలకు, బాట్లు, ఆటోమేషన్ కు సపోర్ట్ చేసే ఓపెన్ API కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. దాని ఎన్ క్రిప్షన్ ప్రోటోకాల్ లు, విజిల్ బ్లోయర్ ఫ్రెండ్లీ వైఖరి ప్రాచుర్యం పొందాయి.ఫీచర్అరట్టైవాట్సాప్టెలిగ్రామ్టెక్స్ట్, మీడియా, డాక్స్✅ సపోర్ట్✅ సపోర్ట్✅ సపోర్ట్ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్వాయిస్ కాల్స్ మాత్రమేవాయిస్, వీడియో, టెక్స్ట్వాయిస్, వీడియో, టెక్స్ట్గ్రూప్ సైజ్ లిమిట్1,000 మంది1,024 మందిఅపరిమితం (ఛానెళ్ల ద్వారా)డేటా వినియోగండేటా విక్రయం ఉండదుకొంత డేటాను పంచుకుంటుందిదాదాపు ప్రైవేటుఫైల్ సైజ్ లిమిట్2 GB వరకు2 GB వరకు2–4 GBబాట్లు/ ఆటోమేషన్❌ లేదు✅ బిజినెస్ బాట్స్✅ ఓపెన్ API బాట్సెక్యూరిటీ విజిల్ బ్లోయర్✅ ఉంది❌ లేదు✅ ఉంది -
వాట్సప్‌కు పోటీగా అరట్టై.. 75 లక్షల డౌన్లోడ్స్!
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'అరట్టై'కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ యాప్ శుక్రవారం నాటికి మొత్తం 75 లక్షల డౌన్లోడ్లను అధిగమించింది. అంటే అంతమంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇది ఇటీవలి కాలంలో.. అతి తక్కువ కాలంలో ఎక్కువ డౌన్లోడ్స్ పొందిన యాప్‌లలో ఒకటిగా నిలిచింది.ఇప్పటి వరకు చాలామంది భారతీయులు.. మెటా యాజమాన్యంలోని వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇక దేశీయ యాప్ అరట్టైను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్‌కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా నేను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నా అంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్‌ఫ్లిక్స్‌కు రూ.2 లక్షల కోట్ల నష్టం!➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఆనంద్ మహీంద్రా ఫోన్లో కొత్త యాప్ డౌన్లోడ్
వాట్సాప్ మాదిరి దేశీయ కంపెనీ జోహో తయారు చేసిన ఆన్లైన్ కమ్యునికేషన్ యాప్ ‘అరట్టై’(Arattai)ని గర్వంగా డౌన్లోడ్ చేసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్‌లోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దేశీయ టెక్నాలజీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంలో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. జోహో సంస్థ కొత్తగా రూపొందించిన చాట్, కాలింగ్ యాప్ అరట్టైకి ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మద్దతు ప్రకటించారు. ‘గర్వంగా అరట్టైను డౌన్లోడ్ చేశా’ అని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనికి యాప్ అధికారిక హ్యాండిల్ తక్షణమే స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అరట్టై ప్లాట్ఫామ్లోకి ఆయనను ఆహ్వానించింది.దీనిపై కంపెనీ చీఫ్ శ్రీధర్ వెంబు స్పందిస్తూ.. ‘నేను మా తెన్కాసి కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో సమావేశంలో ఉన్నాను. యాప్‌కు మెరుగుదలలు చేస్తున్నాం. మా టీమ్‌లో ఒక సభ్యుడు ఈ ట్వీట్‌ను చూపించాడు. ధన్యవాదాలు @anandmahindra. మీ మద్దతు మాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ‘మీ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ప్రోత్సహించారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..