బైపాస్ రోడ్డుపై.. రూ. 1600 కోట్ల డబ్బు
కోటి, రెండు కోట్లు రూపాయలు కాదు.. అక్షరాల 16 వందల కోట్ల రూపాయల డబ్బు! ఈ నోట్ల కట్టలన్ని ఒక్కచోట పేర్చితే ఎంత బరువు, ఎంత పెద్ద సైజులో ఉంటుందో కదా..! ఈ డబ్బును తరలించాలంటే కంటెయినర్లు కావాలి.
కర్ణాటకలోని మైసూర్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురానికి 16 వందల కోట్ల రూపాయల నగదును తరలించడానికి ఏర్పాట్లు చేశారు. రెండు కంటెయినర్లలో ఈ డబ్బును భారీ భద్రత మధ్య తరలిస్తున్నారు. తమిళనాడులో కరూర్-అరువంకుర్చి బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా అనుకోని అవాంతరం వచ్చిపడింది. ఓ లారీ ఇంజిన్లో సమస్య రావడంతో ఈ కంటెయినర్లు రోడ్డుపై ఆగిపోయాయి. భద్రతగా వస్తున్న సాయుధ పోలీసులు కంటెయినర్ల వద్ద రక్షణగా నిలిచారు. పూర్తి వివరాలు తెలియవు కానీ ఇది బ్యాంకులకు సంబంధించిన డబ్బుగా భావిస్తున్నారు. డబ్బును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.